Begin typing your search above and press return to search.

ట్రంప్‌ ను తీసేయాల‌ని 46 న‌గ‌రాల్లో నిర‌స‌న‌

By:  Tupaki Desk   |   4 July 2017 5:08 AM GMT
ట్రంప్‌ ను తీసేయాల‌ని 46 న‌గ‌రాల్లో నిర‌స‌న‌
X
అమెరికా అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ట్రంప్ తీరును మ‌రోసారి త‌ప్పు ప‌డుతూ భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని నిర్వ‌హించారు. అమెరికా వ్యాప్తంగా 46 న‌గ‌రాల్లో ఈ ఆందోళ‌న‌లు చోటు చేసుకున్నాయి. అమెరికాలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన లాస్ ఏంజెలిస్‌.. కాలిఫోర్నియా.. న్యూయార్క్‌.. ఫ్లోరిడా.. ఇలా ప‌లు న‌గ‌రాల్లో ట్రంప్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చోటు చేసుకున్నాయి.

అధ్యక్ష ప‌ద‌వి నుంచి ట్రంప్‌ ను తొల‌గించాల‌ని.. అభిశంస‌న చ‌ర్య‌ల‌ను కాంగ్రెస్ ప్రారంభించాల‌ని వారు కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా 46 న‌గ‌రాల‌కు చెందిన వేలాది ప్ర‌జ‌లు వీధుల్లోకి రావ‌టంతో ట్రంప్ పై వేటు వేయాల‌న్న వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ట్రంప్ వ‌ల‌స విధానాల‌ను.. వ్యాపార ఒప్పందాల్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌జ‌లు ర్యాలీలు నిర్వ‌హించారు. ట్రంప్‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ.. బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌జ‌లు వీధుల్లో త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. అయితే.. నిర‌స‌న‌ల్లో పాల్గొన్న జ‌నాలు పెద్ద‌గా లేర‌న్న వాద‌న వినిపిస్తోంది.

కొన్నిచోట్ల మాత్రం ట్రంప్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ధీటుగా ట్రంప్ అనుకూల ప్ర‌ద‌ర్శ‌న‌లు చోటు చేసుకున్నాయి. అయితే.. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని చెబుతున్నారు. మొత్తం ఆందోళ‌న‌లు నిర్వ‌హించిన 46 న‌గ‌రాల్లో ఒక్క లాస్ ఏంజెలిస్ లో నిర్వ‌హించిన ర్యాలీనే అతి పెద్ద‌దిగా అభివ‌ర్ణిస్తున్నారు.

ఈ ర్యాలీలో దాదాపు ప‌దివేల మంది ఆందోళ‌న‌కారులు పాల్గొన్న‌ట్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఇక‌.. ప్లోరిడాలోనూ ఆందోళ‌న‌ల్ని చేప‌ట్టారు. ఇక్క‌డి నిర‌స‌న స్పెష‌ల్ ఏమిటంటే.. వీకెండ్స్ లో ట్రంప్‌.. ఇక్క‌డి పామ్ బీచ్ లో గ‌డిపేందుకు వ‌స్తుంటారు. దీంతో.. ఈ క్ల‌బ్ ద‌గ్గ‌ర ఆందోళ‌న నిర్వ‌హించారు. ఇక‌.. న్యూయార్క్ లోని ట్రంప్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోట‌ల్ ఎదుట కూడా కొంద‌రు నిర‌స‌న ర్యాలీని నిర్వ‌హించారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/