Begin typing your search above and press return to search.
2027 తర్వాత ఆ వాహనాలు కనిపించవు
By: Tupaki Desk | 11 May 2023 9:00 PM GMTప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు తగ్గుతున్నాయి. అందుకే ప్రత్యామ్నాయ వాహనాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెల్సిందే. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ మరియు గ్యాస్ ఆధారిత వాహనాలు ఎక్కువగా రోడ్ల పై తిరుగుతున్న విషయం తెల్సిందే. కానీ ఇండియాలో మాత్రం ఇంకా డీజిల్ ఆధారిత వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి.
డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువగా ఉండటంతో పాటు భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తులు చాలా తగ్గడంతో పాటు రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అందుకే భారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ 2027 నాటికి దేశంలో మొత్తం డీజిల్ వాహనాలను నిషేదించాలని సిఫార్సు చేసింది.
ఈ విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీజిల్ వాహనాల స్థానంలో గ్యాస్ మరియు విధ్యుత్ ఆధారిత వాహనాలను అందుబాటులోకి తీసు కు వచ్చిన తర్వాత మాత్రమే డీజిల్ వాహనాల యొక్క నిషేధం పై నిర్ణయం తీసుకోవాలని మంత్రిత్వ శాఖ భావిస్తున్నారు.
ఇండియాలో సరకు రవాణా మరియు ప్రజా రవాణా కోసం ఎక్కువగా డీజిల్ వాహనాలను వినియోగిస్తూ ఉండటం వల్ల ఉన్నట్టుండి వాటిని బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి అంటూ చర్చ జరుగుతోంది. ఇండియాలో డీజిల్ వాహనాల బ్యాన్ కి మరో పదేళ్ల సమయం అవసరం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.