Begin typing your search above and press return to search.
వైసీపీకి ఆ సీట్లు తగ్గవు...మ్యాజిక్ ఫిగర్ మాటేంటి...?
By: Tupaki Desk | 11 Feb 2023 6:00 PM GMTఎన్నికలు ఏడాది దూరంలో ఉన్నా ఆ వేడి మాత్రం బాగానే రాజుకుంది. అధికార వైసీపీ చూస్తే ఏడాది ముందే అంతా సిద్ధం చేసుకుంది. ఎప్పటికపుడు సర్వేలు చేయించుకుంటోంది. ఐ ప్యాక్ టీం అయితే మరోసారి వైసీపీతో ఒప్పందం చేసుకుని 2024 ఎన్నికల కోసం పనిచేస్తోంది. ఈ సర్వే తో పాటు మరో రెండు సర్వేలు కూడా సమాంతరంగా వైసీపీ చేయించుకుంటోందని అంటున్నారు. తెలుగుదేశం విషయానికి వస్తే రాబిన్ శర్మ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు.
ఆయన కూడా తన టీం ద్వారా ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తూ అధినాయకత్వానికి అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక తెలుగుదేశానికి మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే అనుకూల మీడియా నుంచి ఎప్పటికపుడు సర్వే నివేదికలు అందడమని అంటున్నారు. ఇవిలా ఉంటే కొన్ని తటష చానళ్ళు, ప్రైవేట్ సంస్థలు చేసే సర్వేలు కూడా ఉన్నాయి. వాటి ఫలితాలు కూడా బయటకు వస్తున్నా అన్నీ సరిచూసుకునే వైసీపీ టీడీపీ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 సీట్లు అని అధినేత జగన్ పార్టీ వారితో తరచూ చెబుతూ వస్తున్నారు. హామీలతోనే 151 సీట్లు వచ్చినపుడు 90 శాతం పైగా వాటిని నెరవేర్చాక 87 శాతం ప్రజానీకానికి సంక్షేమ ఫలాలను అందించాక 175 సీట్లు ఎందుకు రావు అని వైసీపీ అధినాయకత్వం వేస్తున్న ప్రశ్న లాజిక్ కి అందుతున్నా రాజకీయాల్లో లాజిక్కులకు మ్యాజిక్కులకు అసలు చోటు లేదు.
ఒకసారి ఒక ఫలితం వచ్చింది. మళ్లీ అదే రిపీట్ కావాలని ఏమీ లేదు. ఇది రాజకీయ సహజ సూత్రం. విజయానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అందువల్ల 2019లో వచ్చిన దాన్నే మళ్లీ సాధించాలన్న వైసీపీ పట్టుదల ఓకే కానీ అదే జరుగుతుంది అని లేదు అంటున్నారు. వైసీపీలో కూడా అధినాయకత్వం 175 సీట్లు అని టార్గెట్ పెట్టినా ఎంతో కొంత తగ్గి మరోసారి అధికారం చేపట్టడం కోసమే ఇదంతా అని అంటున్న వారూ ఉన్నారు.
వీటిని పక్కన పెడితే పొత్తులు ఎత్తులు, మరో ఏడాదిలో మారే రాజకీయాలు. పలు వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత. పార్టీ ఎమ్మెల్యేల మీద జనంలో ఉన్న వ్యతిరేకత. సహజంగా అయిదేళ్ల పాలన మీద వచ్చే యాంటీ ఇంకెంబెన్సీ ఇలాంటివి పరిగణనలోకి తీసుకుంటే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని మీద అయితే అన్ని సర్వేలు ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ అనుకూల సర్వేలు మళ్లీ అధికారం అనవచ్చు కానీ నిష్పాక్షికంగా చేసే సర్వేలు కూడా ఆ పార్టీకి అందుతాయి. అలాగే తెలుగుదేశం అనుకూల సర్వేలు పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ లో ఎవరి బలాలు ఏంటి అన్న దాని మీద చేసే సర్వేలు కూడా ఉంటాయి. వీటిని క్రోడీకించినపుడు వైసీపీకి ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో అయినా అరవై నుంచి డెబ్బై సీట్లు రావడం పక్కా అని అన్ని సర్వేల నుంచి అందుతున్న అతి కీలకమైన సమాచారం. దీన్ని బట్టి చూస్తే వైసీపీ మరోమారు అధికారం చేపట్టాలీ అంటే మ్యాజికి ఫిగర్ అయిన 88 సీట్లకు కనీసంగా ఇరవై సీట్ల దూరంలో ఉందని అంటున్నారు.
అయితే సర్వేలకు రియాలిటీకి తేడా ఉంటుంది. 60 నుంచి 70 సీట్లలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల ఆయా సీట్లలో విజయం ఖాయం. అదే టైం లో ఎన్నికల వేళ తనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవడం కానీ లేక తెలుగుదేశం పార్టీ లోని లోపాలను క్యాష్ చేసుకోవడం కానీ అభ్యర్ధుల ఎంపికలో వేసే ఎత్తులు, సామాజిక సమీకరణలు. సంక్షేమ పధకాల ప్రభావాలు ప్రత్యర్ధి పార్టీల పొత్తుల ఎత్తులు బెడిసికొడితే వచ్చే లాభాలు ఇలా ఇవన్నీ కూడా పోలింగ్ వేళనే తేలే సత్యాలు. అందువల్ల వాటి ఆధారంగా చేసుకుంటే వైసీపీ ఏదో విధంగా మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తుంది అని అన్న వారూ ఉన్నారు.
ఏది ఎలా ఉన్నా ఏపీలో వచ్చే ఎన్నికలు మాత్రం హోరా హోరీగానే ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశం జనసేన కలిస్తే 110 సీట్ల దాకా రావచ్చని, తెలుగుదేశం జనసేన, బీజేపీ కలిస్తే కేంద్రం పట్ల వ్యతిరేకత వల్ల ఆ సంఖ్య 70కి పడిపోతుందని అదే తెలుగుదేశం జనసేన, వైసీపీ విడిగా పోటీ చేసినా 90 సీట్ల నుంచి వంద దాకా గెలుచుకుని తెలుగుదేశం అధ్హికారంలోకి వస్తుందని, ఇక వామపక్షాలు, తెలుగుదేశం జనసేన పోటీకి దిగితే 120 దాకా సీట్లు వస్తాయని ఒక ప్రైవేట్ సర్వే చెబుతోంది. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ సర్వేలు ఏమి చెప్పినా కూడా ఏపీలో ఎన్నికల వేళ జనాలు ఇచ్చేదే అసలైన తీర్పు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.