Begin typing your search above and press return to search.

ఐటీ లో ఆ ఉద్యోగాలు 'అవుట్'.. షాకిస్తున్న కొత్త రిపోర్టు

By:  Tupaki Desk   |   26 May 2023 1:45 PM GMT
ఐటీ లో ఆ ఉద్యోగాలు అవుట్.. షాకిస్తున్న కొత్త రిపోర్టు
X
ఓ వైపు మాంద్యం పరిస్థితులతో దిగ్గజ ఐటీ సంస్థల్లో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ఐటీ రంగ ఉద్యోగులు. ఇదిలా ఉంటే.. అదే ఐటీ రంగంలో ఫ్లెక్సీ స్టాఫ్ గా వ్యవహరించే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కష్టకాలం వచ్చి పడింది. ఈ సిబ్బందిని తొలగించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆరు శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయిన షాకింగ్ నిజాన్ని వెల్లడించింది ది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్.

దాదాపు 120 నియామక ఏజెన్సీల సంఘంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తాజాగా ఒక నివేదిక ను విడుద లచేసింది. అందులో ఐటీ రంగానికి చెందిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ సిబ్బందిలోఆరు శాతాన్ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన పరిస్థితులు.. రష్యా - ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న యుధంతో పాటు.. ఇతరత్రా కారణాలతో ఉద్యోగాలు పోతున్న పరిస్థితి.

120 సంస్థల నుంచి దాదాపు 60 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐటీ కంపెనీల్లో పని చేస్తుంటే.. వారిలో 6 శాతానికి సమానమైన 3600 మందిని మార్చి త్రైమాసికంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ తొలగింపు మరింతగా ఉండే అవకాశం ఉందంటున్నారు.రాబోయే నెలల్లో ఐటీ రంగానికి గిరాకి తక్కువగా ఉండే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

2022 మార్చి నాటికి దేశీయ ఐటీ రంగంలో దాదాపు 51 లక్షల మంది సిబ్బంది ఉండగా.. కొత్త రిక్రూట్ మెంట్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చెబుతున్నారు. 2022 కు ముందు ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల సిబ్బందికి కాంట్రాక్టు ఉద్యోగాలు వస్తే.. 2022-23 నాటికి ఈ సంఖ్య 1.77 లక్షలు కావటం గమనార్హం. మొత్తంగా చూస్తే ఐటీ రంగం లోని కాంటాక్టు ఉద్యోగులకు ఇబ్బందికర కాలం నడుస్తుందన్న విషయం తాజా రిపోర్టు స్పష్టం చేస్తుందని చెప్పాలి.