Begin typing your search above and press return to search.
తొలిప్రేమ థియేటర్ లో రచ్చ.. మొబైల్ స్టేటస్ తో దొరికిపోయారా?
By: Tupaki Desk | 4 July 2023 9:56 AM GMTపాతికేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రీరిలీజ్ చేసిన తొలిప్రేమ సినిమా సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి విజయవాడలో చోటు చేసుకోవటం తెలిసిందే. బెజవాడలోని కపర్ది థియేటర్ లో కొందరు రచ్చగాళ్లు చేసిన రచ్చ చేసిన వైనం తెలిసిందే. స్క్రీన్ ను చించేయటంతో పాటు కుర్చీలను ధ్వంసం చేయటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అనంతరం ఇది రాజకీయ రంగు పులుముకోవటం.. పవన్ ఫ్యాన్సే చేశారని కొందరు.. కాదు ఇదంతా వైసీపీకి చెందిన వారే చేశారన్న ఆరోపణల్ని మరికొందరు చేయటం తెలిసిందే.
అయితే.. ఈ కేసును డీల్ చేసిన పోలీసులు తాజాగా వివరాలు వెల్లడించారు. రచ్చ చేసినోళ్లు పవన్ ఫ్యాన్సేనని తేల్చారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 8 మంది పవన్ అభిమానులు జూన్ 30న కపర్ది థియేటర్ కు వెళ్లారు.
తొలిప్రేమ సెకండ్ షోకు వెళ్లిన వారిలో కొందరు మద్యాన్ని సేవించి వెళ్లారని.. సినిమాలో ఒక పాట వస్తున్న వేళ వారిలో కొందరు స్క్రీన్ ముందున్న సిమెంట్ దిమ్మపైకి ఎక్కారని చెప్పారు.
అత్యుత్సాహంతో అక్కడున్న తెరను పట్టుకొని డ్యాన్స్ చేయటం.. వారించిన థియేటర్ సిబ్బంది వారిని కిందకు దించేసినట్లు పోలీసులు చెప్పారు. దీంతో రచ్చ మొదలుపెట్టారని.. ఈ ఉదంతంలో స్క్రీన్ చిరిగిపోవటంతో పాటు.. సీట్లను కూడా ధ్వంసం చేశారని చెప్పారు.
అయితే.. ఈ ఉదంతంపై థియేటర్ యజమాని ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. అయినప్పటికీ సత్యానారాయణపురం పోలీసులు ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
శాంతిభద్రతల్ని కాపాడే విషయంలో రాజీ పడేది లేదన్న పోలీసులు.. థియేటర్ లో రచ్చ చేసిన రచ్చగాళ్లు.. వాట్సాప్ స్టేటస్ గా సదరు వీడియోల్ని పెట్టుకోవటంతో వారిని గుర్తించినట్లు పేర్కొన్నారు. కొందరు ఈ రచ్చను ఇన్ స్టాలోనూ పోస్ట్ చేశారు. సాంకేతికత ఆధారంగా అసలు నిందితుల్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని.. పూర్తిగా మద్యం మత్తులో చేశారంటున్నారు.