Begin typing your search above and press return to search.
లాంగ్ ఫోన్ కాల్.. అలవాటు మీకుంటే..ఈ వార్నింగ్ మీకే
By: Tupaki Desk | 7 May 2023 10:05 AM GMTసెల్ లేని జీవితం సాధ్యమే కాదన్న పరిస్థితి ఇప్పుడు. జీవితాన్ని సుఖంగా సాఫీగా సాగేలా చేసే సెల్ తో వచ్చే ఆరోగ్య సమస్యలు తక్కువేం కాదు. సెల్ తీసుకొచ్చిన టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫోన్ లేనిదే జీవితం లేదన్నట్లుగా మారిపోయిన వేళ.. ఫోన్ మాట్లాడే కారణంగా కలిగే ఆరోగ్య సమస్యల మీద చైనా కు చెందిన పరిశోధకులు ఒక పరిశోధన చేపట్టారు.
దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. అదే పనిగా ఫోన్ మాట్లాడితే ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్న విషయం పై అవగాహన ఉన్నప్పటికీ.. ఆ అలవాటునుంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే.. ఫోన్ ఎంతసేపు మాట్లాడితే ఎంత ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది. వారానికి అరగంట కంటే ఎక్కువసేపు ఫోన్ మాట్లాడే వారికి అధిక రక్తపోటుఅవకాశం 12 శాతం వరకు పెరుగుతుందని చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ ఏ వయసు నుంచి వాడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే.. సరాసరిన పదేళ్ల వయసు వచ్చేసరికి వారికంటూ ఒక ఫోన్ వచ్చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు. ప్రపంచంలో మూడొంతుల మందికి పదేళ్ల వయసుకే ఫోన్లు ఉంటున్నాయి. సెల్ ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీకెన్సీ శక్తిని విడుదల చేస్తుంటాయి. వీటిని ఎక్కువగా వాడేకొద్దీ ఆరోగ్య సమస్యలు ఖాయమంటున్నారు.
సెల్ ఫోన్ ను వారానికి అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే అధిక రక్త పోటు కు అవకాశం ఖాయమంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురి అకాల మరణాలకు హైబీపీయే కారణమని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడితే.. హైబీపీ శాతం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు. బ్రిటన్ లోని బయో బ్యాంక్ నుంచి 37-73 ఏళ్ల వయసున్న 2 లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వారానికి ఎంతసేపు ఫోన్ మాట్లాడతారు? అన్న విషయంపై ఆసక్తికర విషయాల్ని గుర్తించారు. 7శాతం మందిలో అధిక రక్తపోటు వస్తున్నట్లు గుర్తించారు.
వారానికి అరగంట పాటు ఫోన్ మాట్లాడే వారిలో 12 శాతం అధిక రక్తపోటుకు అవకాశం ఉంటే.. వారానికి అరగంట నుంచి గంట పాటు ఫోన్ మాట్లాడేవారిలో 13 శాతం.. ఒకటి నుంచి మూడు గంటలు మాట్లాడే వారిలో 16 శాతం అధిక రక్తపోటు ముప్పు ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఫోన్ మాట్లాడటం ఎంతతక్కువగా ఉంటే అంత మంచిదన్న విషయం తాజా అధ్యయనం స్పష్టం చేస్తుందని చెప్పాలి.