Begin typing your search above and press return to search.
ఈ సారి చిన్న నోట్ల రద్దా..? ప‌్రచారం వైరల్.. ప్రభుత్వం ఏమంటోంది?
By: Tupaki Desk | 25 Jan 2021 10:12 AM GMTరెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. కనీస అవసరాలకు డబ్బుల్లేక కోట్లాది మంది ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రెండు వేల రూపాయల కోసం బ్యాంకుల కోసం నానా అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగింది. అయితే.. ఆ కష్టాలు మరిచిపోయి తమ పనుల్లో పడిపోయిన భారతీయుల్ని మళ్లీ ఒక వార్త కలవరానికి గురిచేస్తోంది. అదే చిన్న నోట్ల రద్దు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న పాత రూ.5 - రూ.10 - రూ.100 నోట్లని రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకోనుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతోంది. రాబోయే ఏప్రిల్ నాటికి వీటి చలామణిని పూర్తిగా నిలిపివేయాలని RBI నిర్ణయించిందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే.. రూ.10 కాయిన్ తీసుకోవడానికి చాలామంది వెనుకాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ కొత్త వార్త వైరల్ అవుతుండడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు దీనిపై స్పందించింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నోట్లలో రూ.100 - రూ.10 నోట్లు కూడా ఉన్నాయి. దీంతో.. ఇప్పటికీ చెలామణిలో ఉన్న రూ.100 - రూ.10 - రూ.5 నోట్లను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి తప్పించాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ(DLSC), డిస్ట్రిక్ట లెవల్ కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ(DLMC) సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్(AGM) చెప్పారని ప్రచారం జరిగింది. దీంతో దీనికి అవకాశం ఉంటుందేమోనని కొందరు అనుమానం వ్యక్తంచేశారు.
అయితే.. ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. పాత రూ.100 - రూ.10, రూ.5 నోట్లు చలామణిలో ఉండబోవనే వార్తలు అబద్దమని PIB (ఫ్యాక్ట్ చెక్ బృందం) స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు - నిర్ణయాలు - ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరిగితే.. PIB స్పష్టత ఇస్తూ వస్తోంది. ఈ ప్రకటనతో ఆ వార్తలు అవాస్తవమని తేలిపోయింది.