Begin typing your search above and press return to search.

ఒక పెళ్లి కూతురు ఐదుమంది పెళ్లి కొడుకులు అసలు కథ ఇదే !

By:  Tupaki Desk   |   30 March 2021 2:30 AM GMT
ఒక పెళ్లి కూతురు ఐదుమంది పెళ్లి కొడుకులు అసలు కథ ఇదే !
X
పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన ఓ నవ వధువు , తీరా పెళ్లి సమయానికి మండపం నుండి జంప్ అయింది. దీంతో సదరు వరుడు నేరుగా పోలీస్‌ స్టేషన్‌ చేరగా అక్కడ అతడిలాంటి వ్యక్తులు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఒక వధువు.. ఐదుగురు పెళ్లి కుమారులు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. తీరా ఆరా తీస్తే ఒకే యువతి ఆ ఐదుగురిని మోసం చేసిందని తెలిసీ అందరూ షాక్‌కు గురయ్యారు.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. హర్దా జిల్లాకు చెందిన ఓ యువకుడికి చాలా రోజుల తర్వాత ఓ పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో వరుడు పెళ్లి ముహూర్తం రోజు తన బంధుమిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే, కోలాహలంగా ఉండాల్సిన పెళ్లి మండపాలు తాళం వేసి ఉండటం చూసి వారు నోరెళ్లబెట్టారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఓకే రోజు ఐదుగురు పెళ్లి కుమారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని హార్దా జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఓ ఫంక్షన్‌హాల్‌ లో శుక్రవారం ఆయన వివాహం జరగాల్సి ఉంది. అయితే కుటుంబసభ్యులతో ముహూర్త సమయానికి పంక్షన్‌ హాల్ ‌కు వెళ్లేసరికి ఎవరు కనిపించలేదు. పైగా ఆ ఫంక్షన్ హాల్‌ కు తాళం వేసి ఉండటాన్ని బంధు మిత్రులు గమనించారు. దీంతో వధువుకు ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులను ఆరా తీసిన ప్రయోజనం లేకపోయింది.

దీనిపై పోలీసులు వివరాలు సేకరించగా.. ఆ ఐదుగురిని మోసం చేసింది ఒక్కరేనని తేలింది. పెళ్లి చేసుకుందామని ఐదుగురికి ఒకే రోజు ఆ వధువుగా ఉన్న యువతి వారిని నమ్మించింది. దీంతో అది నమ్మిన ఆ ఐదుగురు పెళ్లి మండపానికి రాగా ఆమె అసలు బండారం బయటపడింది. దీని వివరాలు పోలీస్‌ అధికారి భూపేంద్ర సింగ్‌ తెలిపారు. మోసం చేసింది ముగ్గురు అని గుర్తించాం. వారు ఓ గ్యాంగ్‌గా మారి పెళ్లి కాని యువకులను ఈ విధంగా వలలో వేసుకుని మోసం చేస్తుంటారు. వారిని ఇప్పటికే అరెస్ట్‌ చేశాం’ అని భూపేంద్ర సింగ్‌ వివరించారు. అయితే ఇలాంటి మోసాలు ఆ గ్యాంగ్‌ తరచూ చేస్తుంటారని చెప్పారు.