Begin typing your search above and press return to search.

ఓట‌ర్ల జాబితాపై టీడీపీ న‌యా ప్లాన్ ఇదే...!

By:  Tupaki Desk   |   1 Feb 2023 1:00 PM GMT
ఓట‌ర్ల జాబితాపై టీడీపీ న‌యా ప్లాన్ ఇదే...!
X
రాష్ట్రంలో 2024లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని.. ఓట‌ర్ల జాబితా రెడీ అయింది. అయితే.. దీనిలో లోపాలు ఉన్నాయ‌నేది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ప్ర‌ధానంగా.. వైసీపీ అనుకూల ఓటు బ్యాంకు పెరిగేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని.. గ‌తంలో ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ ఆరోపించారు. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే 7 వేల మంది టీడీపీ సానుకూల వ్య‌క్తుల ఓట్లు తీసేశార‌ని ఆయ‌న చెప్పారు.

ఇక‌, మైల‌వరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా ఇదే ఆరోప‌ణ చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా ఒక యాప్ ను రూపొందించుకుని..దాని ద్వారా అస‌లు ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌నే వివ‌రాల‌ను ప‌రిశీలించారు. దీంతో దాదాను త‌న నియ‌జ‌క‌వ‌ర్గంలో 25 వేల టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని గుర్తించి కంప్లెయింట్ ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గించార‌నేది పార్టీ ఆరోప‌ణ‌.

అయితే.. దీనిని కేవలం రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట్ల‌పై ప‌రిశీలన చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను ఇప్ప‌టికే రూపొందించిన పార్టీ నాయకులు ఫిబ్ర‌వ‌రి 1 నుంచి దీనిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. దీని ప్ర‌కారం.. ప్ర‌తి ఓట‌రు జాబితాను నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌లాలు, గ్రామాల ప‌రిధిలో పరిశీలించ‌నున్నారు.

ముఖ్యంగా చ‌నిపోయిన వారి ఓట్లు ఎన్ని ఉన్నాయి.. ఒకే పేరుతో ఉన్న ఓట‌ర్లు ఎంత మంది.. వారు ఏ పార్టీకి సానుకూలంగా ఉన్నారు.. అనే కీల‌క విష‌యాల‌ను ఈ స‌ర్వేల్లో రాబ‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును ఎంత మేర‌కు తొల‌గించారో కూడా గుర్తించ‌నున్నా రు. దీనికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌త్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా త‌ప్పులు గుర్తించి.. కేంద్ర ఎన్నిక ల‌సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.