Begin typing your search above and press return to search.

ఒక్క షేరు రూ.లక్షకు చేరిన తొలి కంపెనీ ఇదే!

By:  Tupaki Desk   |   13 Jun 2023 12:21 PM GMT
ఒక్క షేరు రూ.లక్షకు చేరిన తొలి కంపెనీ ఇదే!
X
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ.. ఎంఆర్‌ఎఫ్‌ రికార్డు సృష్టించింది. బాంబే స్టాక్‌ ఎక్సే చంజ్‌ లో ఒక్క షేర్‌ విలువ రూ.లక్ష రూపాయల కు చేరుకున్న తొలి కంపెనీ గా ఎంఆర్‌ఎఫ్‌ రికార్డులు నమోదు చేసింది.

జూన్‌ 13న మంగళవారం దలాల్‌ స్ట్రీట్‌లో ఎంఆర్‌ఎఫ్‌ కొత్త మైలురాయిని అందుకుంది. ఇది రూ. లక్ష మార్కును దాటిన మొదటి స్టాక్‌ గా నిలిచింది. గతేడాది జూన్‌ 17న ఒక్కో ఎంఆర్‌ఎఫ్‌ షేరు ధర రూ.65,900 ఉండగా సంవత్సరం తిరిగేటప్పటికి 45 శాతం అధికంగా ఒక్కో షేర్‌ రూ.1,00,300కి చేరింది. ఇది 52 వారాల గరిష్టం కావడం గమనార్హం.

కాగా జూన్‌ 12న సోమవారం తో పోలిస్తే జూన్‌ 13న మంగళవారం ఎంఆర్‌ఎఫ్‌ ఒక్కో షేరు 1.07 శాతం పెరిగింది. మంగళవారం రూ.99,500 తో ప్రారంభమైన ఎంఆర్‌ఎఫ్‌ షేరు రూ.1,00,300 కు చేరుకుంది. సోమవారం ట్రేడింగు లో షేరు రూ.98,939.70 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

ఎంఆర్‌ఎఫ్‌ తర్వాత ఒక్కో షేర్‌ విలువ పరంగా తర్వాత స్థానాల్లో హనీవెల్‌ ఆటోమేషన్‌ (ఒక్కో షేరు రూ. 41,152), పేజ్‌ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, 3ఎం ఇండియా, అబాట్‌ ఇండియా, నెస్లే, బాష్‌ వంటివి ఉన్నాయి .

కాగా చెన్నై కి చెందిన ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ మొత్తం 42,41,143 షేర్లను కలిగి ఉంది, వీటి లో 30,60,312 షేర్లు పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల యాజమాన్యంలో ఉన్నాయి. ఈ మొత్తం ఈక్విటీ లో 72.16% శాతాని కి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా ప్రమోటర్లు 11,80,831 షేర్లను కలిగి ఉన్నారు, మొత్తం ఈక్విటీ లో వీరి వాటా 27.84%.

కాగా మొత్తం 40,000 మంది చిన్న పెట్టుబడిదారులు ఎంఆర్‌ఎఫ్‌ లో స్టాక్స్‌ కలిగి ఉన్నారు. గత 3 నెలల్లో, దాదాపు రూ. 42,500 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ స్టాక్‌ 20% పైగా ర్యాలీ చేసింది.

కాగా 2023–25లో ఎంఆర్‌ఎఫ్‌ లో 6% వృద్ధి నమోదవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.