Begin typing your search above and press return to search.
స్థానిక ఎన్నికలపై ఏపీ సర్కార్ అభ్యంతరాలివీ
By: Tupaki Desk | 10 Jan 2021 4:40 AM GMTఏపీ స్థానిక సంస్థల ప్రకటన చిచ్చు పెట్టింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను పక్కనపెట్టి ఏకంగా నోటిఫికేషన్ జారీ చేయడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఈ స్థానిక ఎన్నికలను ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టుకెక్కింది. ఎన్నికల కోడ్.. నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని.. రద్దు చేయాలని కోరుతూ పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది ఈ పిటీషన్ దాఖలు చేశారు. అమలు నిలిపివేయాలని కోరారు.దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరుపనుంది.
ఎన్నికల తేదిని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటిని లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేది తన పిటీషన్ లో పేర్కొన్నారు. తమ అభ్యంతరాలు ఎస్ఈసీ నిమ్మగడ్డకు అందించామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా వేళ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఎన్నికల ప్రకటన చేశారని పిటీషన్ లో ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ తో కూడిన ముగ్గురు అధికారులు కలిసి ఎన్నికలపై అభ్యంతరాలు తెలిపినా ఎస్ఈసీ నోటిఫికేషన్ వేశారని.. దీంతో సంప్రదింపులు ఓ ఫార్స్ ప్రక్రియ అని తెలుస్తోందని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారని ఆరోపించారు.
కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ఉందని.. డ్రైరన్ చేస్తున్నామని.. ఈ సమయంలో వద్దని అన్నా వినలేదని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా వ్యాక్సినేషన్ లో ఉంటే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలిపినా ఎస్ఈసీ వినలేదన్నారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని.. దీని వెనుక రాజకీయ కుటిల ఉద్దేశాలు ఉన్నాయని ప్రభుత్వం పిటీషన్ లో ఆరోపించింది. నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకొని ఎన్నికలు ఆపాలని పిటీషన్ లో విన్నవించింది.