Begin typing your search above and press return to search.

గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న ఫోటో ఇది..

By:  Tupaki Desk   |   4 Jan 2021 10:30 AM GMT
గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న ఫోటో ఇది..
X
ఈ ఫోటోను చూసినంతనే సీనియర్ సిటిజన్లు మొత్తం ఒక చోటు చేరి పార్టీ చేసుకున్నట్లుగా అనిపించక మానదు. ఈ ఫోటో వెనుక అసలు స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఫోటోకు మన దేశానికి అంతో ఇంతో లింకు కూడా ఉంది. ఇంతకీ విషయం ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. ఒకే కుటుంబానికి చెందిన పన్నెండు మంది సోదర సోదరీమణులు ఒకే చోటికి చేరారు. అందులో ప్రత్యేకత ఏమంటే.. వీరందరి వయసు కూడితే.. అత్యధిక సంవత్సరాలు రావటంతో గిన్నిస్ బుక్ లొ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈ సోదర సోదరీమణులంతా పాకిస్థాన్ లో పుట్టారు. అయితే.. వీరు పుట్టిన తేదీల్ని పరిగణలోకి తీసుకుంటే.. అప్పటి భారత్ లో పుట్టినట్లేఅని చెప్పాలి. వీరంతా ఒకే తల్లిదండ్రులకు పుట్టారు. అయితే.. వీరిలో ఎవరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో లేరు. అంతా కెనడా.. లండన్.. స్విట్జర్లాండ్.. అమెరికాలతో సహా పలు దేశాల్లో స్థిరపడ్డారు. వారంతా తాజాగా కలిశారు. వారిలో పెద్దావిడ వయసు 97 ఏళ్లు అయితే.. పిన్న వయసు 75 ఏళ్లు.

మొత్తం పన్నెండు మంది సిస్టర్స్ వయసు కూడితే ఎంత వస్తుందో తెలుసా? 1042 సంవత్సరాల 315 రోజులు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వీరిలో తొమ్మిది మంది అమ్మాయిలు కాగా.. ముగ్గురు అబ్బాయి. వీరంతా ఇప్పటికి జీవించి ఉన్నారు. అదెంతో గర్వించే అంశంగా 91 ఏళ్ల జాయిస్ డిసౌజా చెబుతారు. నిజమే.. అంత పెద్ద కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండటం ఆనందించే విషయం.కాకుంటే.. వారంతా వేర్వేరు చోట్ల స్థిరపడటం.. కలిసి లేకపోవటం కాస్తంత లోటుగా చెప్పక తప్పదు.

ఇక.. పన్నెండు మంది పేర్లు.. వారు పుట్టిన సంవత్సరాల్ని చూస్తే..
1. డోరిన్ (సెప్టెంబర్ 3,1923)
2. ప్యాట్రిక్ (సెప్టెంబర్ 30, 1925)
3. జెనీవీవే (జూలై 1927)
4. జాయిస్ (మార్చి 2. 1929)
5. రోనీ (ఆగస్టు 24,1930)
6. బెరిల్ (ఆగస్టు 26, 1932)
7. జాయ్ (జూన్ 1, 1934)
8. ఫ్రాన్సెస్కా (సెప్టెంబర్ 17, 1936)
9. అల్తియో (జూలై 27, 1938)
10. తెరెసా (జూన్ 9, 1940)
11. రోస్ మేరీ (మార్చి 30, 1943)
12.యుగేనియా (అక్టోబర్ 24, 1945)