Begin typing your search above and press return to search.

మీకు తెలుసా? ఈ హెడ్‌సెట్‌ తో నొప్పులు మాయం

By:  Tupaki Desk   |   25 July 2021 12:30 AM GMT
మీకు తెలుసా? ఈ హెడ్‌సెట్‌ తో నొప్పులు మాయం
X
శారీరక శ్రమ, వృద్ధాప్యం తదితర కారణాల వల్ల మనుషులకు నొప్పులు వస్తుంటాయి. వీటిని తగ్గించేందుకు గాను రకరకాల మెడిసిన్స్ యూజ్ చేస్తుండటం మనం గమనించొచ్చు. అయితే, ఇంగ్లిష్ మెడిసిన్స్ యూసేజ్ వల్ల నొప్పులు నయమవుతాయి. కానీ, అది తాత్కాలికం మాత్రమే. దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మొత్తంగా నొప్పులు మళ్లీ మొదటికి వస్తాయి. ఈ క్రమంలోనే హెడ్ సెట్ ధరిస్తే చాలు..నొప్పులు నయమయేలా వినూత్న ఆవిష్కరణ చేశారు శాస్త్రవేత్తలు. ఏంటి? హెడ్ సెట్‌తో నొప్పులు మటుమాయవడమేంటి? అనుకుంటున్నారా? అవునండీ మీరు చదివింది నిజమే. హెడ్‌సెట్ ధరిస్తే చాలు..నయమవుతాయట. అదెలాగో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఇకపోతే సాధారణంగా నొప్పులు ఉండే మానవులు అందరూ వాడే ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్. వీటి వాడకం వల్ల నొప్పులు తగ్గుతాయి. కానీ, వాటితో దుష్ప్రభావాలు ఉంటాయి. అవి మాత్రమే కాకుండా ఇక తప్పనిసరి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే అనేలా ప్రతీ రోజు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ క్రమంలోనే నొప్పులకు శాస్త్రీయ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. నొప్పిని తగ్గించే హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ఎనిమిది వారాల పాటు ధరిస్తే చాలు..నొప్పులు తగ్గుతాయట. ఈ హెడ్ సెట్ ధరిస్తే మనిషి మానసిక స్థితిలో మార్పు రావడంతో పాటు నిద్ర మంచిగా వస్తుంది. మానవాళి జీవన ప్రమాణాలూ మెరుగుపడతాయి.

వివిధ విషయాల పట్ల మనుషులకున్న నిరాశ, ఆందోళన కూడా హెడ్‌సెట్ ధారణ వల్ల తగ్గిపోతాయని నిపుణులు చెప్తున్నారు. ఈఈజీ అనగా ఎలక్ట్రో ఎన్సెఫలో‌గ్రామ్ అనే టెక్నాలజీ సాయంతో తయారు చేయబడిన ఈ హెడ్‌సెట్ మనిషి మెదడు తరంగాలను రీడ్ చేస్తుంది. నొప్పిని ఎదుర్కోవడానికి మెదడును సిద్ధం చేస్తుంది. తద్వారా నొప్పి లక్షణాలు తగ్గుతాయి. తలపైన ధరించే ఈ హెడ్‌సెట్ టోటల్ హెల్త్‌కు మేలు జరుగుతుంది. హెడ్‌సెట్‌లో ఉండే ఎనిమిది ఎలక్ట్రోడ్లు మెదడులోని విద్యుత్ కార్యకలాపాలు, తరంగ ధైర్ఘ్యాలను పరిశీలిస్తాయి. ఈ హెడ్‌సెట్‌తో మూర్ఛ వ్యాధిని గుర్తించొచ్చు కూడా.

హెడ్‌సెట్‌లోని ఎలక్ట్రోడ్స్ ఆధారంగా రోగి మెదడుకు సంబంధించిన డేటా కూడా ఆటోమేటిక్‌గా రీడ్ అవుతుంది. ఫలితంగా దానిని అంచనా వేసి న్యూరోఫీడ్ బ్యాక్ థెరపీ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మెదడు నరాల పని తీరు మెరుగవడంతో పాటు నొప్పి తగ్గుతుంది. న్యూరో ఫీడ్ బ్యాక్ స్యాడ్‌నెస్‌ను కలిగించే బ్రెయిన్ వేవ్స్‌ను అణచివేస్తాయి. ఇలా పెయిన్ రిలీఫ్ కలిగించే ప్రయత్నం చేస్తుంది ఈ హెడ్‌సెట్. వచ్చే ఏడాది నాటికి హ్యూమన్‌కు మేలు చేసే ఈ హెడ్‌సెట్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రజెంట్ న్యూజిలాండ్‌లో ఈ హెడ్‌సెట్‌పై పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు.

ఇందుకు గాను వంద మందిని సెలక్ట్ చేసి వారిపై హెడ్ సెట్ ఉంచి పరిశీలన కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతున్నట్లు న్యూరాలజిస్ట్ డాక్టర్ నిక్ సిల్వర్ వెల్లడించారు. ఒకసారి ఈ హెడ్ సెట్ రీసెర్చ్ ఫుల్లీ సక్సెస్ అయితే మానవాళికి ఎంతో ప్రయోజనముంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళి అభివృద్ధి, ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందని చెప్పేందుకు ఈ వినూత్న ఆవిష్కరణ మరో ఉదాహారణగా మిగులుతుంది.