Begin typing your search above and press return to search.
ఈ కరోనా మరింత డేంజర్.. యువతతో పాటు వారికి కూడా ముప్పే
By: Tupaki Desk | 31 Dec 2020 9:30 AM GMTమొదట్లో విస్తరించిన కరోనా ఎంత భయపెట్టినా వయసు మళ్ళిన వారు, ఆరోగ్యపరంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవారికి మాత్రమే తీవ్ర ప్రభావం చూపింది. అలాంటి వారే చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. మృత్యువాత పడ్డారు. అయితే ఆరోగ్యంగా ఉండే యువతపై కరోనా పెద్ద ప్రభావం చూపలేదు. కరోనా బారినపడ్డవారు సులభంగానే కోలుకున్నారు.
అయితే కొత్తగా బ్రిటన్ లో బయట పడిన కరోనా స్ట్రెయిన్ యువతలో, చిన్నపిల్లల్లో కూడా ప్రభావం చూపుతుందని ఆల్ ఇండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధిపతి, హార్వర్డ్ యూనివర్సిటీ ఎపిడిమాలోజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి వెల్లడించారు. రూపాంతరం చెందిన కరోనా మునుపటితో పోలిస్తే డేంజర్ గా మారిందని, మరణాలు ఎక్కువగానే ఉంటాయని ఆయన వెల్లడించారు.
గతంలో ఆరోగ్యంగా ఉన్నవారు, యువత, చిన్న పిల్లలపై కరోనా పెద్ద ప్రభావం చూపలేదని కొత్త కరోనా మాత్రం వారిలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. కొత్త వైరస్ మానవ శరీర కణాల్లోకి వేగంగా చొచ్చుకుపోయి భారీగా పునరుత్పత్తి చెందేలా రూపాంతరం చెందినట్లు తెలిపారు. కరోనాతో పోలిస్తే స్ట్రెయిన్ 60 నుంచి 70 శాతం వేగంగా విస్తరించే అవకాశం ఉండటంతో గతంతో పోలిస్తే కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ముందుకంటే ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ వైరస్ కు అడ్డుకట్ట వేయలేమని శ్రీనాథ రెడ్డి తెలిపారు. చిన్న పిల్లలే కదా వారికి అప్పుడు ఏమీ కాలేదు.. ఇప్పుడూ అంతే అనుకోవద్దని సూచించారు.