Begin typing your search above and press return to search.

బడ్జెట్ 2023: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి ఈ కాంబినేషన్

By:  Tupaki Desk   |   1 Feb 2023 9:13 AM GMT
బడ్జెట్ 2023:  దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి ఈ కాంబినేషన్
X
కొత్త ఏడాది వచ్చిందంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఆర్థిక బడ్జెట్ మీద బోలెడన్ని అంచనాలు ఉండటం తెలిసిందే. మరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశాన్ని సొంతం చేసుకుంది మోడీ సర్కారు. రెండోసారి కేంద్రంలో కొలువు తీరిన నమో సర్కారు తన హయాంలో పెట్టనున్న పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్ ఇదే.

వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టినా.. అది పూర్తి స్థాయి బడ్జెట్ కాదన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మేలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టే సమగ్ర బడ్జెట్ గా దీన్ని చెప్పాలి. ఇక.. ఈ ఏడాది ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది.

బ్రిటిష్ కాలంలోనే కాదు.. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఎప్పుడూ ఎదురుకాని ఒక అరుదైన విశేషం తాజా బడ్జెట్ సందర్భంగా కనిపించనుంది. ఒక మహిళగా రాష్ట్రపతి తన పదవుల్ని చేపట్టటం ఇదేం కొత్త కాదు. గతంలోనూ రాష్ట్రపతిగా బాధ్యతల్ని నెరవేర్చిన వారు ఉన్నారు.

అయితే.. తాజాగా రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ద్రౌపదీ ముర్ము ఒకవైపు.. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా ఒక మహిళ ఉండటం.. వారిద్దరి నడుమ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న వైనం ఇప్పటివరకు లేదనే చెప్పాలి. ఈసారి సార్వత్రిక బడ్జెట్ కు ఇదో హైలెట్ గా చెప్పక తప్పదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇదేనని చెబుతున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ ఒకరు ట్వీట్ చేయటం.. అది కాస్తా వైరల్ గా మారింది. మరి.. ఇద్దరు మహిళలు కీలక స్థానాల్లో నిలిచి ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో మహిళలకు సంబంధించిన కీలకమైన ప్రకటన ఏమైనా ఉంటుందా? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.