Begin typing your search above and press return to search.
పరిటాలను చంపించింది వారే...లోకేష్ పాదయాత్రలో మాటల మంటలు
By: Tupaki Desk | 9 April 2023 8:40 PM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. అరవై అయిదవ రోజు పాదయాత్రను మండే ఎండలో సైతం జోరు జోరుగా చేస్తున్నారు లోకేష్. ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఏకి పారేస్తున్నారు. అలా ఇపుడు ఆయన తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద గట్టిగానే నోరు చేశారు.
తాడిపత్రిలో పెద్దిరెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దందా చేస్తున్నారని లోకేష్ విరుచుకుపడ్డారు. ముదిగుబ్బలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని విమర్శించారు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలను అంతు లేకుండా పోతోందని ఈ ఇద్దరి నియోజకవర్గాలలో అక్రమలను భూ దందాలను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే బయట పడేసి అంతా కక్కిస్తామని లోకేష్ బిగ్ సౌండ్ చేశారు.
అసలే సీమ జిల్లాలు, లోకేష్ ఇలా మాట్లాడగానే అటు నుంచి కూడా తూటాలు పేలతాయి కదా. ఇపుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి రీ సౌండ్ చేశారు. లోకేష్ పాదయాత్రలో జేసీ బ్రదర్స్ ఇస్తున్న స్క్రిప్ట్ ని చదవడం కాదు వాస్తవాలు తెలుసుకోవాలని రివర్స్ అటాక్ చేశారు. జేసీ బ్రదర్స్ లాంటి అక్రమార్కులను పక్కన పెట్టుకుని లోకేష్ తన మీద విమర్శలు చేయడమేంటి అని మండిపడ్డారు.
లోకేష్ తెలుసుకోవాలంటే జేసీ బ్రదర్స్ ఆగడాలను అక్రమాలను పూర్తి ఆధారాలతో తెస్తానని వాటిని ఆయన వినడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. జేసీ బ్రదర్స్ ఎంతో మంది టీడీపీ నేతలకు కార్యకర్తలకు నరకం చూపించారని, వారి ఇళ్లను ద్వంసం చేసి అరాచకాలే చేశారని పెద్దారెడ్డి ఆరోపించారు. అంతవరకూ ఎందుకు టీడీపీ నేత పరిటాల రవిని చంపించిందే జేసీ బ్రదర్స్ అంటూ సంచలన అరోపణలు చేశారు పెద్దారెడ్డి.
అనాడు మొద్దు శ్రీను చేతికి ఆయుధాలు ఎక్కడ నుంచి వెళ్లాయో లోకేష్ తెలుసుకుంటే మంచిందని అన్నారు. పరిటాలను చంపించింది జేసీ బ్రదర్స్ అన్న సంగతి జిల్లా ప్రజలందరికీ తెలుసు అని ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి అక్రమాల పుట్ట అయిన కుటుంబానికి లోకేష్ మద్దతు తెలియచేయడం కంటే దారుణం ఉండదని అన్నారు. టీడీపీ క్యాడర్ మీద దాడి చేసిన వారిని లోకేష్ వెనకేసుకుని వస్తూ తన మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
లోకేష్ పాదయాత్ర వేళ రోజుకో కొత్త స్క్రిప్ట్ ని జేసీ బ్రదర్స్ తయారు చేసినా దాన్ని లోకేష్ వల్లించినా జనాలు ఎవరూ నమ్మరని, వాస్తవాలు అందరికీ తెలుసు అని పెద్దారెడ్డి అంటున్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర కాదు కానీ పెద్దారెడ్డి పరిటాల హత్య న్యూస్ ని పాత విషయనని కొత్తగా చెప్పి మరీ జేసీ బ్రదర్స్ మీద పెద్ద బండ వేశారు. అయినా ఆయన మీద జేసీల స్క్రిప్టులు ఆగుతాయనుకుంటే పొరపాటే అంటున్నారు తమ్ముళ్ళు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.