Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు ఇవే!
By: Tupaki Desk | 1 Jun 2023 9:00 AM GMTరెండు సార్లు గెలిచిన ఉత్సాహంతో హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తమది జాతీయ పార్టీ అని చెప్పుకొస్తున్నారు. పక్కనున్న ఏపీ, మహారాష్ట్రలలోనూ పోటీ చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో తన మిత్రుడు జేడీయూ అధినేత కుమారస్వామి కోసం పోటీ చేయకుండా ఉన్న కేసీఆర్ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలైన ఆమ్ ఆద్మీ సహా కలిసి వచ్చే పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ప్రత్యామ్మాయంగా ఎదగాలని చూస్తున్నారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వెనుక కూడా రాజకీయం ఉందని.. దీనివెనుక కేసీఆర్ స్కెచ్ గీశారని అంటున్నారు. ప్రజల్లో ఇప్పుడు జాతీయ భావం మెండుగా ఉంది. బీజేపీ దాన్నే క్యాష్ చేసుకుంటోంది. గుజరాత్ మోడల్ కు పోటీగా.. తెలంగాణ మోడల్ ను దేశానికి చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే మూడోసారి గెలుపు కష్టమని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సహా చిన్న పార్టీల సాయం తీసుకోవడానికి కూడా వెనుకాడరని అంటున్నారు. ముఖ్యంగా జాతీయ సర్వేలు కూడా కేసీఆర్ ఈసారి మెజార్టీకి పది నుంచి 15 సీట్ల దూరంలో నిలిచిపోతాడని చెబుతున్నాయి.
తాజాగా కొన్ని జాతీయ సంస్థలు తెలంగాణలో సర్వే చేయగా కేసీఆర్ పార్టీకి కేవలం 43-48 సీట్లు మాత్రమే వస్తాయని.. అటూ ఇటుగా చూస్తే 50 సీట్ల వరకూ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత వల్ల కేసీఆర్ మూడో సారి ఏకపక్షంగా విజయం సాధించలేరని సర్వేలో తేలింది.
అయితే కేసీఆర్ కు సాయంగా ఇటు ఎంఐఎం పార్టీ 7 ఎమ్మెల్యే సీట్లతో ఆదుకునేందుకు రెడీగా ఉంది. ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్లు ఎవరో ఒకరు గెలిస్తే ప్రభుత్వంలోకి తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ కు కావాల్సినంత స్కోపు ఉంది. ఇక ఇలా కాకుంటే మెజార్టీకి 20 సీట్ల దూరంలో అంటే 40 సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ మొహమాట పడడు. బీజేపీని ఓడించడానికి గద్దెనెక్కకుండా చేయడానికి కాంగ్రెస్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ తో కలవక తప్పని పరిస్థితి. అలా ఎలా చూసుకున్నా వచ్చేసారి కేసీఆర్ దే గెలుపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.