Begin typing your search above and press return to search.
దండకారణ్యంలో తుపాకుల గర్జన భారీ ప్రాణనష్టం!
By: Tupaki Desk | 4 April 2021 8:30 AM GMTఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా-బీజాపూర్ సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల నడుమ నిన్నటి నుంచి మొదలైన ఎన్ కౌంటర్.. భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఈ కాల్పుల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.
శనివారం ఆరుగురు భద్రతా సిబ్బంది ఒక మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆదివారం మరో 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీరంతా జవాన్లే అని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. మరో 21 మంది జవాన్లు కనిపించకుండా పోయినట్టు సమాచారం.
ఈ ఎదురు కాల్పుల ఘటనలో మొత్తం 31 మంది జవాన్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో కొందరిని బీజాపూర్, మరికొందరిని రాయ్ పూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కనిపించకుండా పోయిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపినట్టు సమాచారం.
కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్ కౌంటర్ లో మరణించిన పోలీసులకు నివాళి అర్పించారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ తో అమిత్ షా మాట్లాడారు. అంతేకాకుండా.. సీఆర్పీఎఫ్ డీజీ కుల్ దీప్ సింగ్ ను ఛత్తీస్ గఢ్ వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. దీంతో.. కుల్ దీప్ ఛత్తీస్ గఢ్ వెళ్లారు.