Begin typing your search above and press return to search.
కేంద్రం-మహారాష్ట్ర మధ్య రెమ్ డెసివిర్ చిచ్చు
By: Tupaki Desk | 19 April 2021 8:49 AM GMTకరోనా వైరస్ యాంటీ టీకాల కోసం కేంద్రప్రభుత్వం-మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య చిచ్చు పెరిగిపోతోంది. శనివారం ముంబయ్ శివారు ప్రాంతంలో 60 వేల రెమ్ డెసివిర్ వయల్స్ ను ముంబాయ్ పోలీసులు పట్టుకోవటమే తాజా వివాదానికి కారణమైంది. ముంబాయ్ లోని దామన్ ప్రాంతంలోని బ్రక్ ఫార్మా కంపెనీ రెమ్ డెసివిర్ టీకాలను పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అయితే ఒకేసారి 60వేల టీకాలను జంబో లారీలో పెట్టుకుని ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
దాంతో లారీతో పాటు మొత్తం స్టాకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు బ్రక్ ఫార్మా కంపెనీ యజమాని రాజేష్ డొకానియాను పోలీసుస్టేషన్ కు పిలిపించుకుని విచారణ చేసి పంపించేశారు. రాజేష్ ను పోలీసులు విచారణ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ కో పోలీసుస్టేషన్ కు వచ్చి పెద్ద గొడవచేశారు. దాంతో ఈ విషయం చివరకు రాజకీయ వివాదంగా మారింది.
టీకాల లారీని పోలీసులు పట్టుకోవటం కానీ కంపెనీ యజమాని రాజేష్ ను పోలీసులు పిలపించి విచారించటం కానీ తప్పేమీకాదు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తు గోల చేయటమే ఫడ్నవీస్ అండ్ కో తప్పు. ఇప్పటికే టీకాల కేటాయింపులో కేంద్రం-మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఓ యుద్ధమే జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తాను కేంద్రమంత్రితోను, బ్రిక్ ఫార్మాకంపెనీతోను మాట్లాడి ఆ టీకాలన్నింటినీ ప్రజల ఉపయోగం కోసమే తెప్పిస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పటం.
రాష్ట్రప్రభుత్వం అడిగినా రెమిడెసివిర్ టీకాలను ఇవ్వటానికి ఇటు కంపెనీ యాజమాన్యం కానీ అటు కేంద్రంకానీ అంగీకరించలేదు. అలాంటిది బీజేపీ నేత ఫడ్నవీస్ అడగిన వెంటనే 60 వేల టీకాలు ఇవ్వటం ఏమిటంటు ప్రభుత్వం+కాంగ్రెస్+ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. కరోనా వైరస్ సమస్యను కూడా కేంద్రం తన స్వార్ధానికి ఉపయోగించుకుంటోందంటు ముఖ్యమంత్రి ఉద్ధత్ థాక్రే మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్రమోడిపై మండిపోయారు. మొత్తానికి ఏదోరూపంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ పాపులర్ చేయాలన్న కుట్రే కనబడుతోంది.