Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్ - జ‌య‌ల‌లిత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే!

By:  Tupaki Desk   |   26 Feb 2023 6:00 AM GMT
ర‌జ‌నీకాంత్ - జ‌య‌ల‌లిత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే!
X
ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖ తార‌ల‌ మ‌ధ్యా రిలేష‌న్ షిప్ ప‌లు సంద‌ర్భాల్లో అపార్థంగా మారింది. దానికి కార‌ణాలు అనేకం. సినిమా రంగంలో ప్ర‌స్థానం.. రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఈ అపార్థాలు చోటు చేసుకున్నాయి. తొలిగా 1978లో భీంసింగ్‌ కుమారుడు లెనిన్‌ జయలలితను సినిమా చేయమని సంప్రదించాడు. అతని తండ్రి మాజీ మెంటర్ అయినందున ఆమె వెంటనే అంగీకరించింది. జ‌య‌ల‌లిత‌కు సహనటుడిగా రజనీని ఎంపిక చేశారు. అనంత‌రం జ‌య‌ల‌లిత నేరుగా ర‌జ‌నీని కలవాలనుకుంది. కానీ అంతకు ముందు రమాప్రభ (ఆమె స్నేహితురాలు.. తెలుగు- హిందీలలో ఒకప్పటి నటి) ఆమె భర్త శరత్ బాబును హీరోగా ఎంపిక చేయాల‌ని అభ్యర్థించింది.

త‌న‌కు బదులుగా శరత్ బాబుని నటింపజేసే ఆలోచ‌న ఉంద‌ని లెనిన్ నేరుగా రజనీకాంత్ కి చెబుతారని అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అప్ప‌టికే జయలలితను కలవడానికి రజనీ ఆమె ఇంటికి వెళ్లారు. కానీ ఇంటి తాళం వేసి గేట్లు మూసి ఉండడం చూసి ర‌జ‌నీ ఆశ్చ‌ర్య‌పోయారు. దానికి తోడు ర‌జ‌నీకి వాచ్ మెన్ మేడమ్ లేరని కొంత‌ అసభ్యంగా చెప్పాడు. ఆ రోజుల్లో SMS లేదా వాట్సాప్ అందుబాటులో లేవు. ఫోన్ నంబర్లు 4 అంకెలు లేదా 5 అంకెలతో ఉండేవి.

కార‌ణం ఏదైనా అపార్థం మొద‌లైంది. రజనీ తీవ్ర అవమానానికి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. లెనిన్ క్షమాపణలు చెప్పాడు. శరత్ బాబు రజనీని పిలిచాడు. రజనీ ఈ ఇద్దరి క్ష‌మాప‌ణ‌ల‌తో కూల్ అయ్యాడు. త‌ర్వాత ర‌జ‌నీ శరత్ బాబుకు చాలా దగ్గరయ్యాడు. అయినా ఎందుక‌నో జయను మరచిపోలేకపోయాడు. ఆమెతో అనుభ‌వం అలా అయ్యింది మ‌రి.

రజనీ తన వీర - ఉజియాప్పాలి షూటింగ్ ను ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తదుపరి సంఘటన జరిగింది. అలసిపోయి ఆకలితో ప్ర‌యాణంలో ఉండ‌గా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. పైగా జయ ల‌లిత‌ కోసం ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు వేచి చూసిన రజనీ చివరకు పొగ తాగాలని నిర్ణయించుకున్నారు. అతను బయటికి వ‌చ్చి ఒక‌ కారు టాప్ (పైకప్పు) పైన‌ కూర్చుని పొగ తాగ‌డం ప్రారంభించాడు. రింగురింగులుగా పొగ వ‌దులుతూ త‌న‌దైన స్టైల్లో ఫోజిచ్చాడు.

అప్ప‌టికే అక్కడ జ‌నం మూగారు. ట్రాఫిక్ పోలీసులు సహా అందరూ ఆ వినోదాన్ని ఆస్వాధిస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఇంత‌లోనే జయ గారి కాన్వాయ్ వచ్చింది. జయ తన కారు పైన రజనీ ధూమపానం చేయడం.. అది చూసి అందరూ నవ్వడం ఆనందించడం గమనించారు. ఆమెకు కోపం వచ్చింది.

తదుపరి సంఘటన 1995లో జరిగింది. అప్పుడే ర‌జ‌నీకాంత్ న‌టించిన `బాషా` విడుదలైంది. రజనీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ ``జయలలితకి ఓటు వేసి గెలిపిస్తే దేవుడైనా కాపాడలేడు`` అని ర‌జ‌నీ వ్యాఖ్యానించారు. 1995 స‌మ‌యంలో రజనీ ఒక ఐకాన్ స్టార్. కానీ ఈ వ్యాఖ్య త‌ర్వాత కూడా జయకు 10 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.

అదే క్ర‌మంలో ఓసారి జయ పెంపుడు కుమారుల పెళ్లి కోసం రజనీ సన్నిహితుడి `బాలు జ్యువెలర్స్` దాదాపు 3 కోట్ల బంగారం డీల్ లో దివాళా తీయడం రజనీ కోపానికి కారణమైంది. ఏది ఏమైనప్పటికీ ర‌జ‌నీ వ‌ర్సెస్ జయ ఎపిసోడ్స్ ర‌న్ అయ్యాయి. ఆ ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ఎప్పుడూ లేనంత‌ కోపంతో ఉన్నారు. కానీ ఆచి మనోరమ మాత్రం నిజంగా తెలివితక్కువ పని చేయకుండా జ‌య‌ల‌లిత‌ను శాంతింపజేసింది.

30 రోజులుగా డీఎంకే కార్యకర్తలు రజినీ ఇల్లు మంటపం బయట క్యాంప్ వేసిన సంద‌ర్భం కూడా ఉంది. అదే క్ర‌మంలో రజనీ తన కుటుంబాన్ని కొంతకాలం బెంగళూరుకు పంపించారు. 1996 తర్వాత - రజనీ - జయల‌లిత‌ ఇద్దరూ క‌క్ష‌లు వీడి కూల్ అయ్యారు.

ర‌జ‌నీ జీవితంలో జ‌య‌.. కొన్ని మ‌ర్చిపోలేని ఘ‌ట‌న‌లు:

*ర‌జ‌నీ ఏ పార్టీకి అండ‌గా నిలిచినా త‌న‌ను వాడుకున్న‌వాళ్లే. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కొన్నాళ్ల‌కు డీఎంకే తనను పావులా వాడుకుంటోందని రజనీ గ్రహించారు. అతను పార్టీలో చేరి MGR 2.0 అవ్వాల‌ని ఆశించాడు. కానీ MK అతన్ని దారుణంగా నిరాశపరిచాడు.

*సహజంగానే జయ ఘోరంగా ఓడిపోయిన సంద‌ర్భంలో జ‌య‌-ర‌జ‌నీ ఇద్దరూ వారి మధ్య విభేధాల‌ను సరిచేసుకున్నారు.

*1997లో మంత్రాలయం నుండి పూజా ప్రసాదం ఇవ్వడానికి రజినీ - లత దంప‌తులు జయను సందర్శించారు.జయ వారికి స్వాగతం పలికి దానిని స్వీకరించారు.

*తర్వాత 1999లో జయ `పాదయప్ప` కోసం రజనీని అభినందించారు. ఆ క్ర‌మంలోనే రజ‌నీ నేరుగా ఆమెను ఆమె ఇంట్లో కలుసుకున్నాడు. జ‌య ర‌జ‌నీకి మెమెంటో ఇచ్చింది.

*2003లో ఐశ్వర్య పెళ్లికి వచ్చినప్పుడు త‌ళా అజిత్ అనేక విధాలుగా ఎంజీఆర్ ని గుర్తుచేసాడని రజనీకి చెప్పింది. అజిత్ నిజానికి జ‌య‌కు స‌న్నిహితుడు.

*2011లో రజనీ సింగపూర్ లో చికిత్స కోసం వెళ్లిన‌ప్పుడు - జ‌య‌ తన ఆందోళనను వెలిబుచ్చింది.

*తర్వాత జ‌య అనారోగ్యంతో ఖుషించిన‌ప్పుడు రజనీ సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ నుండి డాక్టర్లకు సమాచారం అందించి స‌హ‌క‌రించారు. 5 డిసెంబ‌ర్ 2016 లో జ‌య‌ల‌లిత మ‌ర‌ణించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.