Begin typing your search above and press return to search.

పెరుగుతున్నకొవిడ్ కేసులకు కారణం బయటకు వచ్చేసింది

By:  Tupaki Desk   |   23 March 2023 11:00 PM GMT
పెరుగుతున్నకొవిడ్ కేసులకు కారణం బయటకు వచ్చేసింది
X
కొవిడ్ భయం నుంచి బయటపడుతున్నవేళ.. అప్పుడప్పుడు వచ్చే వార్తలు ఉలిక్కిపడేలా చేయటం.. ఆ వెంటనే కాస్తంత భయాందోళనలకు గురి కావటం తెలిసిందే. ఇటీవల కాలంలో కొవిడ్ కేసులు దేశంలో పెరిగినట్లుగా వార్తలు రావటం.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం కేసుల పెరుగుదల ప్రస్తావన తేవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగటానికి కారణం ఏమిటి? అన్న అంశంపై పాజిటివ్ కేసులకు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టారు.

దీంతో కొత్త విషయం బయటకు వచ్చింది. 349 కేసులు XBB.1.16 వేరియంట్ కు సంబంధించినవన్న కొత్త విషయం బయటకు వచ్చింది. దీంతో.. కొత్తగా పెరుగుతున్నకొవిడ్ కేసులకు కారణం ఈ వేరియంట్ అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ XBB.1.16 వేరియంట్ కేసులు జనవరిలో బయటపడ్డాయి. ఫిబ్రవరిలో 140 శాంపిల్స్ లో బయటపడగా.. మార్చిలో 207 కేసుల్లో గుర్తించినట్లుగా చెబుతున్నారు.

తాజాగా తొమ్మిది రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో 349 నమూనాల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో బయటపడ్డాయని.. తర్వాత కేసులు తెలంగాణలోఅని.. కర్ణాటక.. గుజరాత్ లోనూ ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ కొత్త వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మరణానికి దారి తీయనంత వరకు కొత్త వేరియంట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. వైరస్ మ్యూటేషన్లుజరుగుతున్న కొద్దీ ఇలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు 140 రోజుల (నాలుగున్నర నెలలకు పైనే) తర్వాత దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 1300 లకు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. కొత్త వేరియంట్ వార్తలు వస్తున్న వేళ.. కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా.. ఎక్కువ మంది ఉండే చోట జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.