Begin typing your search above and press return to search.
కోడిని అరెస్టు చేసిన పోలీసులు.. కారణం తెలుసా ?
By: Tupaki Desk | 27 Feb 2021 8:00 AM GMTకోడినేంటి అరెస్టు చేయటమేంటి ? అనుకుంటున్నారా ? అవునే మీరు చదివింది నిజ్జంగా నిజమే. ఓ హత్య కేసులో జగిత్యాల జిల్లాలోని పోలీసులు కోడిపుంజును అరెస్టు చేశారు. తొందరలో హత్యానేరంపై సదరు కోడిపుంజును కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని కొండపూర్ కు చెందిన సతీష్ అనే యువకుడు కోడి పందేలను నిర్వహించాడు.
కోళ్ళ పందేలు నిర్వహించటంలో భాగంగా ఓ కోడిపుంజు కాలికి కత్తి కట్టాడు. దాన్ని బరిలోకి దించే ఉద్దేశ్యంతో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయితే కత్తి ఉన్న కాలును కాకుండా రెండో కాలిని పట్టుకున్నాడు. దాంతో అతని చేతిలో నుండి తప్పించుకునే క్రమంలో సదరు కోడిపుంజు కత్తి కట్టి ఉన్న కాలును సతీష్ మీదకు విసిరింది. ఆ విసురుకు కత్తి సతీష్ కడుపులోకి బలంగా దిగేసింది.
వెంటనే కోడిని వదిలేసిన సతీష్ పడిపోయాడు. వెంటనే అక్కడున్న మిత్రులు సతీష్ ను ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకపోయింది. మార్గమద్యంలోనే సదరు యువకుడు మరణించాడు. విషయం తెలసిన పోలీసులు సతీష్ మృతిపై దర్యాప్తు మొదలుపెట్టారు. కోళ్ళపందేల్లో పాల్గొన్న సతీష్ మిత్రులను అరెస్టు చేసిన పోలీసులు పనిలో పనిగా కోడిపుంజును కూడా అరెస్టు చేశారు.
మిత్రులతో పాటు కోడిపుంజును కూడా పోలీసులు సెల్ లో పెట్టారు. స్వేచ్చగా తిరిగే కోడిపుంజును కొన్ని జాగ్రత్తలు తీసుకుని సెల్ లో పెట్టడంతో ఒకటే గోల మొదలుపెట్టింది. దాంతో కాసేపు పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఉన్న చెట్టుకు కట్టేయటం, తర్వాత కొంతసేపు బుట్టలో ఉంచటం, మళ్ళీ ఎక్కడో కట్టేయటంతో స్వేచ్చ కోసం కోడిపుంజు నానా గోల చేస్తోంది. దీని బాధ భరించలేకపోతున్నారు పోలీసులు.
హత్యకేసులో ఏ 1 ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదైన కారణంగా కోడిపుంజును జాగ్రత్తగా కాపాడలేక పోలీసులు నానా అవస్తలు పడుతున్నారు. వీలైనంత తొందరలో కోడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి హత్య కేసులో కోర్టుకు వచ్చే కోడి విషయంలో న్యాయమూర్తి ఏమని తీర్పు చెబుతారో అన్న విషయం ఆసక్తిగా మారింది.