Begin typing your search above and press return to search.
మెట్ గాలాలో మెరిసిన ఏకైక భారతీయురాలు ...ఆమె ఎవరంటే
By: Tupaki Desk | 15 Sep 2021 5:58 AM GMTమెట్ గాలా. మెట్ గాలా ను మెట్ బాల్ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. వాస్తవానికి ఇదో ఫండ్ రైజింగ్ ఈవెంట్. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్ మెట్ గాలా. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2021కు గాను జరిగిన ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో ఓ భారతీయ మహిళ తళుక్కుమని మెరిసింది. ఆమే సుధారెడ్డి.
ఎవరీ సుధారెడ్డి.. అంటే సుధారెడ్డి మన హైదరాబాద్ మహిళే కావటం విశేషం.ప్రతీ సంవత్సరం మే నెలలో ఈ ఈవెంట్ జరుగుతుంది. కానీ కరోనా వల్ల అన్ని కార్యక్రమాలువలెనె ఇది కూడా వాయిదా పడి సెప్టెంబర్ లో జరిగింది. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్ మెట్ గాలా రెడ్ కార్పెట్ పై ప్రపంచం నలుమూలల నుంచీ సెలబ్రిటీలు హొయలు పోతూ ఫొటోలకు ఫోజులిస్తారు. వారి అందాలను, సొగసుల్ని కెమెరాల్లో బంధిస్తారు ఫోటో గ్రాఫర్లు. అలాంటి ఈవెంట్ లో ఈసారి ఇండియా నుంచి ఒకే ఒక్క వ్యక్తి పాల్గొన్నారు. ఆమె సుధా రెడ్డి. సుధారెడ్డి సెలబ్రిటీకాదు, సినిమా స్టార్ అంతకంటే కాదు.
ఈమె మన హైదరాబాదీ మహిళే. నగరానికి చెందిన బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా.ఈక్రమంలో సుధారెడ్డి ఫస్ట్ టైమ్ మెట్ గాలా రెడ్ కార్పెట్ పై తళుక్కుమని మెరిశారు. డిజైనర్ జోడీ ఫాల్గుని, షేన్ పీకాక్ రూపొందించిన గౌన్‌లో సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. ఆర్ట్, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టపడే సుధారెడ్డి ఇలా ఫస్ట్ టైమ్ ఓ అంతర్జాతీయ వేదికపై కనిపించడం విశేషం. గతంలో జరిగిన ఈ మెట్ గాలా ఈవెంట్ లో భారత్ నుంచి బాలివుడ్ ప్రముఖ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె పాల్గొన్నారు. అలాగే ఇషా అంబానీ కూడా ఈ మెట్ గాలాలో సందడి చేశారు. కానీ సినిమాలకు ఏమాత్రం సంబంధం లేని సుధారెడ్డి మెట్ గాలా రెడ్ కార్పెట్ పై కనువిందు చేయటం విశేషం.