Begin typing your search above and press return to search.

భూమిపై అత్యంత మిస్టరీ ప్రదేశం ... ఎంట్రీ మాత్రమే నో ఎగ్జిట్ .. 2000 ఓడలు, 75 విమానాలు మాయం

By:  Tupaki Desk   |   9 July 2021 10:30 AM GMT
భూమిపై అత్యంత మిస్టరీ ప్రదేశం ... ఎంట్రీ మాత్రమే నో ఎగ్జిట్ .. 2000 ఓడలు, 75 విమానాలు మాయం
X
ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు ఉన్నాయి. మనకు తెలియని జీవరాశులు, ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక మానవుడికి అంతుచిక్కని రహస్యాలు, ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మన భూమ్మీద, మానవులతోపాటు దెయ్యాలు, ఆత్మలు, అతీత శక్తులు కూడా ఉన్నాయని చాలామంది చెప్తుంటారు. అయితే నమ్మేది లేనిది వారి వారి ఇష్టం. దేవుడు ఉన్నట్టే దెయ్యాలు కూడా ఉన్నాయని , కొన్ని ప్రాంతాలను ఇవి తమ ఆవాసంగా మార్చుకున్నాయని , పొరపాటున అక్కడికి వెళితే ఇక మరణం తధ్యమని అంటుంటారు. ఇప్పుడు అలాంటి ప్రదేశం గురించి ఇటీవల కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లినవారు ఇప్పటికీ తిరిగి రాలేదట. దాదాపు 2000 ఓడలు, 75 విమానాలు అదృశ్యం అయ్యాయని అక్కడ దెయ్యాలు, అలాగే ఎదో తెలియని అతీత శక్తి ఉందని అంటున్నారు. ఆ ప్రాంతం గురించి ఇప్పుడు పుర్తిగా తెలుసుకుందాం ...

ప్రపంచంలోనే అత్యంత మిస్టరీగా ఉండే ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మానవుడు సైన్స్ పరంగా ఎంతో ముందుకు వెళ్లిన ,ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు ఎక్కువగానే ఉన్నాయి. యూకెలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాంత రహస్యాన్ని చేధించినట్లుగా తెలిపారు. ఈ ప్రాంతానికి వెళ్లిన ఓడలు, విమానాలు ఇప్పటికీ వరకు ఆచూకీ లేకుండా పోయాయి. దీంతో అక్కడ ఎవరైనా గ్రహాంతర వాసులు ఉన్నారా ,లేదా అతీతశక్తులు ఉన్నాయా , అనే అనుమానాలను వ్యక్తం చేసాు. బ్రిటిష్ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం..రోంగ్ వేవ్ కారణంగా బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తుంటాయని అంటుంటారు.

ఈ తరంగాలు 100 అడుగుల వరకు ఉంటాయని, అందుకే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయని తెలిపారు. ఆంగ్ల దిన పత్రిక 5 డాక్యుమెంటరీ “ది బెర్ముడా ఎనిగ్మా” లో సీక్రెట్స్ ఆఫ్ ది బెర్ముడా ట్రయాంగిల్ అనే సమాచారన్ని ప్రచురించారు. రోగ్ వేవ్ పవిషయానికి వస్తే.. ఇక్కడ 1997లో దీనిని ఉపగ్రహ సాయంతో గుర్తించారు. 1918లో అమెరికాకు చెందిన యుద్ధనౌక బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 300 మంది చనిపోయారు. అయితే శాస్త్రవేత్తలు ఓడ నమునా సాయంతో ప్రమదాలకు గల కారణాలను గుర్తించారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం దాదాపు మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలిపిన అంతకంటే ఎక్కువగా పరిమాణంలో ఉంటుందని గుర్తించారు. సహజ, భౌగోళిక, ఇతర కారణాలతో అట్లాంటిస్ నగరం కనుమరుగైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏదైనా ఓడ, విమానం ఈ ప్రాంతం దగ్గరకు వెళ్లిన తిరిగి రాదు. అయితే వాటికి సంబంధించిన శిధిలాలు కూడా అక్కడ కనిపించవు. ఇందుకు కారణం ఈ ప్రాంతానికి దగ్గర ప్రవహించే బలమైన తరంగమని.. ఇది శిధిలాలను తీసుకెళ్తుందని అంటుంటారు. దాదాపు 1000 సంవత్సరాలలో ఇక్కడ 1000 మరణించినట్లుగా చెబుతుంటారు. అంటే ప్రతి సంవత్సరం నాలుగు విమానాలు, 20 నౌకలు తప్పిపోతుంటాయి. 1945లో యుఎస్ నావికాదళానికి చెందిన ఐదు అవెంజర్ టార్పెడో బాంబర్లు 90 నిమిషాల్లోనే అదృశ్యమయ్యాయి. భూభాగాల అంచున ఉండే మహా సముద్రాల మెరక ప్రాంతాల లో కొన్ని చోట్ల పెద్దపెట్టున మిథేన్ హైడ్రేటుల నిల్వలు ఉన్నాయి. వీటినుండి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను తగ్గించేస్తాయి. కనుక అక్కడ ఓడలు తేలియాడే గుణం తగ్గుతుంది. ప్రయోగశాలలలో నమూనా ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చునని తెలుస్తున్నది. 1981లో అ.సం.రా. జియొలాజికల్ సర్వే వారు అమెరికా తీరప్రాంతాలలో ఉన్న మిథేన్ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వారి వెబ్ సైటులో ఉన్న సమాచారం ప్రకారం "బెర్ముడా త్రికోణం" అనబడుతన్న ప్రాంతంలో పెద్దయెత్తున మిథేన్ వాయువు విడుదలైన దాఖలాలు ఏమీ లేవు.