Begin typing your search above and press return to search.

మోడెర్నా వ్యాక్సిన్​ మనిషి డీఎన్​ఏనే మార్చేస్తోందా? డోస్​లు ధ్వంసం చేసిన ఫార్మాసిస్ట్​..!

By:  Tupaki Desk   |   7 Jan 2021 5:30 AM GMT
మోడెర్నా వ్యాక్సిన్​ మనిషి డీఎన్​ఏనే మార్చేస్తోందా?  డోస్​లు ధ్వంసం చేసిన ఫార్మాసిస్ట్​..!
X
కరోనా మహమ్మారిని జయించడానికి ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. రష్యా మొట్టమొదట స్పుత్నిక్​ వీ అనే వ్యాక్సిన్​ తీసుకొచ్చింది. ఆ తర్వాత అమెరికా ఫైజర్​ కంపెనీ కూడా ఓ వ్యాక్సిన్​ తీసుకొచ్చింది. ఫైజర్​ వ్యాక్సిన్​ అయితే ప్రస్తుతం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు సమాచారం. మరోవైపు వ్యాక్సిన్ లపై దుష్ప్రభావాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్​ వ్యాక్సిన్​ తీసుకున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.అయితే వాళ్లు నిజంగానే వ్యాక్సిన్​ తీసుకోవడం వల్లే చనిపోయారా? లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అన్న విషయంపై విచారణ సాగుతోంది.

ఇదిలా ఉంటే పలు వ్యాక్సిన్లపై భయాందోళనలు నెలకొన్నాయి. సైడ్​ ఎఫెక్ట్స్​ భయంతో కొందరు వ్యాక్సిన్​ తీసుకోవాలంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా మోడెర్నా వ్యాక్సిన్​పై నీలినీడలు కమ్ముకున్నాయి. మోడెర్నా వ్యాక్సిన్​ తీసుకుంటే మనిషి డీఎన్​ఏను అది పూర్తిగా మార్చేస్తోందంటూ ఓ ఫార్మాసిస్ట్​ వ్యాక్సిన్​ డోసులను ధ్వంసం చేశారు. అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. మోడెర్నా వ్యాక్సిన్​ తీసుకుంటే డీఎన్​ఏ మారుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. మరోవైపు సదరు ఫార్మాసిస్ట్​కు మతిస్థిమితం లేదని పోలీసులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది.

స్టీవెన్​ అనే ఓ ఫార్మసిస్టు.. 500 డోస్ ల మోడెర్నా వ్యాక్సిన్​ డోసులను ధ్వంసం చేశాడు. అరోరా మెడికల్‌ సెంటర్‌లో అతడు ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. పోలీసులు గుర్తించారు. కావాలనే కొవిడ్‌ ట్రయల్స్‌ను ధ్వంసం చేశానంటూ ఫార్మసిస్టు పోలీసులకు చెప్పాడట. ‘ఈ వ్యాక్సిన్​ మనిషి డీఎన్​ఏను మార్చేస్తుంది. అందుకే నేను వాటిని ధ్వంసం చేశాను’ అని సదరు ఫార్మాసిస్ట్​ పోలీసులకు చెప్పాడు. విస్కాన్సిన్‌ గ్రాఫ్టన్‌ లో ఉన్న అరోరా మెడికల్‌ సెంటర్‌ లో 46ఏళ్ల అతడు ఫార్మసిస్టు గా పనిచేస్తున్నాడు. అయితే స్టివెన్​ కు మతిస్థిమితం లేదని.. కొంతకాలం క్రితం అతడి భార్య కూడరా అతడికి విడాకులు ఇచ్చేసిందని.. అప్పటినుంచి అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.