Begin typing your search above and press return to search.
మధ్య సీటు ఖాళీతో కరోనా ముప్పు చాలా తక్కువట.. మరి సాధ్యమేనా?
By: Tupaki Desk | 16 April 2021 12:30 PM GMTకరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ కారణంగా సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివేళలో.. ఇంట్లో నుంచి కాలు కదిపి బయటకు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వేళ.. విమాన ప్రయాణాలతో ముప్పు ఎక్కువన్న మాట వినిపిస్తోంది. మరి.. దీని నుంచి బయటపడేందుకు మార్గం లేదా? అన్న అంశంపై అధ్యయాన్ని నిర్వహించారు.
విమాన ప్రయాణంలో డోర్లు.. కిటికీలు పూర్తిగా మూసి ఉంచటం ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం కలుగుతోంది. దీంతో.. వైరస్ ను కంట్రోల్ చేయటానికి ఏం చేయొచ్చన్న అంశంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. అమెరికా వ్యాధుల నియంత్రణ.. నిర్మూలన కేంద్రాలతో పాటు కాన్సాస్ స్టేట్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో విమాన ప్రయాణంలో మధ్య సీటును ఖాళీగా ఉంచటం ద్వారా కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చని తేల్చారు.
విమానంలో ప్రయాణికులతో పూర్తి సామర్థ్యంలో ఉండే దానితో పోలిస్తే.. మధ్య సీటును ఖాళీగా ఉంచటం ద్వారా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పక్కపక్కనే ప్రయాణికులు కూర్చునే కన్నా.. మధ్య సీటు వదిలేసి కూర్చోవటంతో వైరస్ వ్యాప్తి 23 నుంచి 57 శాతానికి తగ్గించే వీలుందన్న విషయాన్ని గుర్తించారు. సీట్ల మధ్య ఖాళీ వదలటం.. ముఖానికి ఫేస్ మాస్కు.. ఫేస్ షీల్డ్ లాంటివి ధరించటం వల్ల వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించే వీలుందని చెబుతున్నారు. అయితే.. మధ్య సీటును వదిలేస్తే.. విమానయాన సంస్థలపై భారం ఎక్కువగా పడుతోంది. దీనికి పరిష్కారంగా.. ప్రయాణికుల మీదకు ఆ భారాన్ని మళ్లించే అంశంపై చర్చ జరుగుతోంది.