Begin typing your search above and press return to search.
మీడియా గొంతునొక్కలేరు.. సుప్రీం విస్పష్ట తీర్పు.. మలయాళ చానెల్ పై నిషేధం
By: Tupaki Desk | 5 April 2023 3:00 PM GMTమీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీడియా సంస్థ గొంతు నొక్కుతారా? జాతీయ భద్రతా చట్టం పేరిట ఆంక్షలు విధిస్తారా? అని ప్రశ్నించింది. మలయాళ న్యూస్ చానెల్ మీద కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రద్దు చేసింది. "ప్రజల హక్కులను కాలరాసేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని లేవనెత్తలేం. కానీ, ఈ విషయంలో హోం శాంఖ దానిని అత్యద్భుతంగా ప్రస్తావించింది" అంటూ సుప్రీం పేర్కొంది.
ఇదీ నేపథ్యం..
2020లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు పెద్దఎత్తున సాగాయి. వీటిని 'మీడియా వన్' చానల్ పలుసార్లు ప్రసారం చేసింది. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ చానల్ పై నిషేధం విధించింది. దీని పై చానల్ యాజమాన్యం కోర్టుకెళ్లింది. బుధవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. చానెల్ పై నిషేధాన్ని సమర్థించేందుకు వాస్తవిక ఆధారాలు లేదా సాక్ష్యాలను చూపడంలో కేంద్రం విఫలమైందని న్యాయమూర్తులు తెలిపారు. "ఈ కేసులో ఉగ్రవాద సంబంధాలను చూపించడానికి ఏమీ లేదు. కేవలం ఊహాగానాలతో జాతీయ భద్రత పై వాదనలు చేయలేం. అభియోగాల్లో పేర్కొన్న ఏ అంశం కూడా జాతీయ భద్రతకు విరుద్ధం లేదా ప్రజా శాంతికి ముప్పు కలిగించేది కాదు" అని సుప్రీం విస్పష్టంగా పేర్కొంది. అసలు పత్రికలు తమకు మద్దతివ్వాలనే వైఖరి ప్రభుత్వానికి ఉండొద్దని పేర్కొంది. టీవీ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పై విమర్శలు కారణం కాకూడదని తెలిపింది.
అవెలా దేశ విరుద్ధం..?
ప్రభుత్వ విధానాలు, చర్యల పై మీడియా వన్ ఛానల్ చేసిన విమర్శలను దేశ వ్యతిరేక భావనలు లేదా అలాంటి భావనల ప్రేరేపణకు కారణమని భావించలేమని, ప్రజాస్వామ్య మనుగడకు పత్రికా స్వాతంత్ర్యం అవసరమని సుప్రీం పేర్కొంది. చానెల్ ప్రసార లైసెన్సు పునరుద్ధరణకు నిరాకరించిన సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వును రద్దు చేసింది. ఇదే సమయంలో "ప్రజల హక్కులను కాలరాయడానికి జాతీయ భద్రత అనే ముఖ్యమైన పాయింట్ ను లేవనెత్తలేం. కానీ, ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ ఆ పనిని అద్భుతంగా చేసింది" అని తప్పుబట్టింది. కాగా, మీడియా వన్ చానెల్ కేంద్ర ప్రభుత్వంతో పలుసార్లు తలపడింది. దీంతో కేంద్రం ఆ చానెల్ అనుమతి రద్దు చేసింది. దీని పై కేరళ హైకోర్టుకు వెళ్లగా కేంద్రం నిర్ణయానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఈ తీర్పు 2022 జనవరి 31న రాగా.. ఆ ఏడాది మార్చి 15న సుప్రీం నిలిపివేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.