Begin typing your search above and press return to search.
లోక్ సభలోనూ తిరుగు లేదు..కశ్మీర్ విభజన పరిపూర్ణం
By: Tupaki Desk | 6 Aug 2019 3:28 PM GMTజమ్మూ కశ్మీర్ విభజన మంగళవారంతో పూర్తి అయిపోయిందని చెప్పాలి. కశ్మీర్ ను రెండు రకాలైన రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్ననే పెద్దల సభ రాజ్యసభలో ఆమోద ముద్ర పడగా... మంగళవారం దిగువ సభ లోక్ సభ కూడా ఆమోద ముద్ర వేసింది. బీజేపీకి అంతగా బలం లేని రాజ్యసభలోనే బంపర్ విక్టరీతో మోదీ సర్కారు ఈ బిల్లును పాస్ చేయించుకోగా... క్లిస్టర్ క్లియర్ మెజారిటీ ఉన్న లోక్ సభలో మోదీ సర్కారు రీ సౌండింగ్ విక్టరీతో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయించింది.
ఈ విక్టరీ ఏ స్థాయిలో దక్కిందన్న విషయాన్ని జనానికి కళ్లకు కట్టేలా చూపేందుకు నరేంద్ర మోదీ - అమిత్ షా ద్వయం... క్లియర్ మెజారిటీ ఉన్న సభలో డివిజన్ పద్దతిలో బిల్లుకు ఓటింగ్ పెట్టింది. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు మద్దతు తెలపగా... వ్యతిరేకంగా కేవలం 67 మంది మాత్రమే నిలబడ్డారు. వెరసి తమదైన డేరింగ్ నిర్ణయానికి లోక్ సభలో ఏ మేర ఓట్లు పడ్డాయన్న విషయాన్ని మోదీ షా ద్వయం దేశానికి తెలిసేలా చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిన్న రాజ్యసభ - నేడు లోక్ సభ... కశ్మీర్ బిల్లుకు ఆమోదం తెలపడంతో కశ్మీర్ విభజన పరిపూర్ణం అయ్యిందని చెప్పాలి.
లోక్ సభలో కశ్మీర్ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రవేశపెట్టగా... బిల్లుపై చర్చలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతంతమాత్రం బలం ఉన్న కాంగ్రెస్ ఈ బిల్లుపై చర్చను అంతగా రక్తి కట్టించలేకపోయింది. బీజేపీ నియంతృత్వ ధోరణితో వెళుతోందన్న వాదనను వినిపించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఘోరంగా విఫలమైందని చెప్పక తప్పదు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత ఆధిర్ రంజన్ చౌదరి చేసిన ప్రసంగంతో ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసింది. సభలో చర్చ జరుగుతుండగానే... కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాహుల్ గాందీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాధిత్య సింథియా కశ్మీర్ బిల్లును సమర్ధిస్తూ చేసిన ట్వీట్ పెను దుమారమే రేపింది.
మజ్లిస్, నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన పలువురు సభ్యులు చేసిన ప్రసంగాలు ఓ మోస్తరుగా ఉన్నా... అమిత్ షా వాటిని తిప్పికొట్టారు. చర్చలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకంటూ లేచిన షా... సుదీర్ఘ ప్రసంగం చేస్తూనే కశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలను చీల్చి చెండాడారని చెప్పక తప్పదు. షా వివరణ తర్వాత ఓటింగ్ జరగగా... మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు బంపర్ మెజారిటీతో విజయం దక్కింది. అంతిమంగా ఎలాంటి అడ్డంకి లేకుండానే కశ్మీర్ విభజనను బీజేపీ సర్కారు ముగించేసిందని చెప్పక తప్పదు.