Begin typing your search above and press return to search.

హ‌మ్మయ్య.. ఖ‌ర్చు త‌గ్గింది.. టీడీపీ నిర్ణ‌యంతో నేతల హ్యాపీ..!

By:  Tupaki Desk   |   14 Feb 2023 8:00 PM GMT
హ‌మ్మయ్య.. ఖ‌ర్చు త‌గ్గింది.. టీడీపీ నిర్ణ‌యంతో నేతల హ్యాపీ..!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణ‌యాల‌పై నిప్పులు చెరిగే నాయ‌కులు.. మ‌రికొన్ని నిర్ణ‌యాల విష‌యంలో మాత్రం హ్యాపీగా ఫీల‌వుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది.. అస‌లు మ‌జా! టీడీపీఅధినేత అనేక సంద‌ర్భాల్లో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లాల‌ని.. పార్టీ నాయ‌కుల‌కు సూచించారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో బాదుడే బాదుడు వంటి కార్య క్ర‌మాల‌ను వెనుక ఉండిమ‌రీ న‌డిపించారు.

ఈ స‌మ‌యంలో నాయ‌కులు కొంత మేర‌కు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. చేతిలో త‌డి ఆరిపోతోంద‌ని కూడా అన్నా రు. అయిన‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు ఆదేశాల‌ను తూ.చ త‌ప్ప‌కుండా పాటించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు అదే చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో నాయ‌కులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ప్ర‌స్తుతం యువ నాయ కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డ‌మే ఆయ‌న ధ్యేయంగా పెట్టుకున్నారు.

దీనిని 4 వేల కిలో మీట‌ర్లు, 4వందల రోజులు నిర్వ‌హించ‌నున్నారు. మ‌రి ఇంత పెద్ద యాత్రలో అంద‌రి భాగ‌స్వామ్యం కూడా ఉండాలి క‌దా! ఉంటుంది క‌దా! అనుకోవ‌చ్చు. కానీ, ఇక్క‌డే పెద్ద ట్విస్టు ఉంది. ఈ పాద‌యాత్ర‌ను చూస్తే.. సీనియ‌ర్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. పార్టీలో ఉన్న మాజీ మంత్రులు.. సీనియ‌ర్ నేత‌లు..కురువృద్ధులు క‌నీసం.. నారా లోకేష్‌ను క‌ల‌వ‌డం లేదు.. ఆయ‌న‌తో క‌లిసి అడుగులు కూడా క‌ద‌ప‌డం లేదు.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అంటే.. చంద్ర‌బాబు తీసుకున్న‌నిర్ణ‌య‌మేన‌నిఅంటున్నారు టీడీపీ నేత‌లు. సీనియ‌ర్లు.. కురువృద్ధులు క‌నుక ఈ పాద‌యాత్ర‌లో క‌నిపిస్తే.. `యువ‌గ‌ళం` పేరుకు అర్ధం లేకుండా పోతుంద‌ని.. దీనిని కేవ‌లం యువ‌కుల‌కు.. 50 ఏళ్ల లోపు వారికి మాత్ర‌మే ప‌రిమితం చేయాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే పాద‌యాత్ర‌కు అనేక మంది సీనియ‌ర్ నాయ‌కులు దూరంగా ఉంటున్నారు. కేవ‌లం సూచ‌న‌లు .. స‌ల‌హాలు ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో యువ‌త పెద్ద ఎత్తున పాల్గొనేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో త‌మ‌కు ఖ‌ర్చు త‌గ్గింద‌ని సీనియ‌ర్లు హ్యాపీగా ఫీల‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.