Begin typing your search above and press return to search.
ఉల్లి కన్నీళ్ల వెనుక ఆనందం
By: Tupaki Desk | 14 Dec 2019 2:30 PM GMTఆటోలో ప్రయాణించిన వారు డబ్బులకు బదులు ఓ పెద్ద ఉల్లిపాయ డ్రైవర్ కు ఇస్తారు. అతడు దాన్ని తీసుకొని చిన్న ఉల్లిపాయలను తిరిగి వారికి ఇచ్చేస్తారు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో తీరు చూసి దేశంలో ‘ఉల్లి ఘాతం’పై అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు దేశంలో ట్రెండింగ్ సబ్జెక్ట్ ‘ఉల్లి’. ఏ పత్రికలో చూసినా.. టీవీలో చూసిన ఉల్లిపై సెటైర్ గా కార్టూన్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఉల్లి బంగారమైందంటూ వీడియోలు పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు.
అయితే ఉల్లి కన్నీళ్ల వెనుక బాధే కాదు.. ఆనందం కూడా ఉంది. ఎంత సేపు దేశంలో ఉల్లి ధరలు పెరిగాయని గగ్గోలు పెట్టడం.. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపడం సర్వసాధారణమే.. కానీ ఈ ఉల్లి ధర పెరగడం వెనుక కొందరు ఆనందం పడుతున్నారు.. వాళ్లే ఉల్లి రైతులు..
ఉల్లి రైతుల పంట పండుతోంది. వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జన్మలో చూడని లాభాలను ఉల్లి రైతులు పొందుతున్నారట..
ఏపీలో ప్రధానంగా ఉల్లిని కరువు ప్రాంతమైన ఆనంతపురం, కర్నూలు జిల్లా వాసులు పండిస్తారు. తాడిపత్రి, కర్నూలు జిల్లాతో సరిహద్దున గల కర్ణాటకలోని బళ్లారి పక్క ప్రాంతాల వారు సాగు చేస్తారు. క్వింటాలు ఉల్లిని 300కు వీరు విక్రయించేవారు. అంటే కిలోకు మూడు చొప్పున. ఇప్పుడు ఏకంగా క్వింటాలుకు పదిహేను వేల రూపాయలు పలుకుతుందోట.. తక్కువ రకంది పదివేలకు తగ్గడం లేదట.. ఎన్నో రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతోంది. ఉల్లి ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు లాభాల పంట పండిస్తోంది.. ఏకంగా ఉల్లిసాగుకు చేసిన ఖర్చులు పోను మూడు లక్షల రూపాయల వరకూ లాభాలొస్తున్నాయట..
ప్రస్తుతం ఉత్తరాధిన కిలో ఉల్లి 200, దక్షిణాదిన 100 నుంచి 150 వరకూ ఉంది. ఈ దరాఘాతంతో ఉల్లి సాగు చేసిన రైతుల వద్ద ఏకంగా క్వింటాలుకు 15వేల రూపాయలు చెల్లించి మరీ వ్యాపారులు కొనుక్కు వెళుతున్నారు.
దేశంలో ఉల్లి ధరలతో అందరూ బాధపడుతుంటే రాయలసీమ, కర్ణాటక రైతాంగం మాత్రం తెగ ఆనందపడుతోంది. దేశంలో పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించని ప్రభుత్వాలున్న కాలంలో ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు కాదు ఆనందాన్ని రైతుల కళ్లల్లో తీసుకురావడం విశేషంగా చెప్పవచ్చు.