Begin typing your search above and press return to search.

రైతుల ఆందోళనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం?

By:  Tupaki Desk   |   17 Feb 2021 5:30 AM GMT
రైతుల ఆందోళనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం?
X
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందనడానికి ఆధారంగా కేంద్ర సర్కార్ పరిధిలోని ఢిల్లీ పోలీసులు పలువురు సామాజిక, పర్యావరణ ఉద్యమకారులను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం కేంద్రంలో ‘టూల్ కిట్ కుట్ర’ కేసుగా అభివర్ణిస్తోన్న ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అనూహ్య కామెంట్లు చేశారు. రైతుల ఆందోళనలో భాగంగా వెలుగుచూసిన ‘టూల్ కిట్’ వివాదంపై కేంద్రమంత్రి గజేంద్ర తెలిపారు. టూల్ కిట్ సూత్రధారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో భారత్ ప్రపంచానికి అందిస్తోన్న సహకారాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

భారత్ ప్రపంచానికి పీపీఈ కిట్లు తయారు చేసి సహకరిస్తుండగా వారు మాత్రం భారతీయులకు వ్యతిరేకంగా టూల్ కిట్లు తయారు చేస్తున్నారు.. సిగ్గు చేటు’ అంటూ షేకావత్ ట్వీట్ చేశారు.

రైతుల ఆందోళనకు మద్తుగా రూపొందించిన టూల్ కిట్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి దిశ రవిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఇద్దరిపై బెయిల్ కు వీల్లేని వారెంట్లు జారీ అయ్యాయి. భారత్ ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంగా టూల్ కిట్ ను రూపొందించారని పోలీసులు వెల్లడిస్తున్నారు.