Begin typing your search above and press return to search.
కంటికి కనిపించని శత్రువు దేశ రాజధానిలో 54 వేల మందిని పొట్టన పెట్టుకుందట
By: Tupaki Desk | 19 Feb 2021 6:30 AM GMTప్రముఖ ఎన్జీవో (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ) గ్రీన్ పీస్ తాజాగా ఒక సంచలన అధ్యయనాన్ని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మహానగరాల్లో కాలుష్య తీవ్రత ఎలా ఉంది? కంటికి కనిపించని మాయదారి దుమ్ము కణాల కారణంగా ఏడాది వ్యవధిలో ఎంత మంది మరణిస్తున్నారన్న చేదు నిజాల్ని తాజా నివేదిక వెల్లడించింది. కాలుష్య కారకాల్లో ప్రమాదకరమైన పీఎం2.5 ధూళి రేణువుల కారణంగా గత ఏడాది వ్యవధిలో 54 వేల మంది మరణించినట్లుగా తాజాగా చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది.
కాలుష్య తీవ్రతపై ఢిల్లీ మహానగరంలో అనుసరించాల్సిన విధానాల గురించి అందులో పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే స్థాయికి మించి ఆరు రెట్లు ఎక్కువ ధూళి కణాలు ఉంటాయని తేల్చింది. ఢిల్లీ మహానగరంలో ప్రతి 10 లక్షల మందికి 1800 మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గ్రీన్ పీస్ కోరింది. దేశ రాజధాని ఒక్క చోటే కాదు.. దేశంలోని మరిన్ని మహానగరాల్లో ధూళి కణాల కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు భారీగా పెరుగుతున్నట్లుగా సదరు నివేదిక వెల్లడించింది.
గాలిలోని దుమ్ము కణాల కారణంగా గత ఏడాది ముంబయిలో 25వేలు.. బెంగళూరులో 12 వేలు.. చెన్నైలో 11 వేలు.. హైదరాబాద్ లో 11 వేలు.. లక్నోలో 6700 మంది కాలుష్య కారకాలతో ప్రాణాలు విడిచినట్లుగా గ్రీన్ పీస్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన దానితో పోలిస్తే.. ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యకారకాలు ఉన్నట్లు తేలిందని.. ఈ కారణంగా ఢిల్లీలో రూ.58,895కోట్ల విలువైన ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంది.
ఇది ఢిల్లీ జీడీపీలో 13 శాతంగా నివేదిక పేర్కొంది. ఇక.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా నివసించే ఢిల్లీ.. మెక్సికో.. సావోపౌ.. షాంఘై.. టోక్యో.. నగరాల్లోనే గత ఏడాదిలో దాదాపు 1.6లక్షల మంది మరణించినట్లుగా లెక్క తేలింది. వాతావరణంలో అతి ప్రమాదకర కణాల్లో ఒకటైన పీఎం 2.5 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క 2015లో 42 లక్షల మంది అకాల మరణాలకు కారణమైందని పేర్కొంది. ఈ లెక్కలన్ని చూస్తే.. కరోనా కంటే ప్రమాదకరమైనదిగా చెప్పక తప్పదు.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ పుణ్యమా అని వాతావరణంలోని కాలుష్య కారకాలు తగ్గినప్పటికి.. అది తాత్కాలికమేనని.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కాలుష్యం.. ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. గాలి కాలుష్య ప్రభావంతో సంభవిస్తున్న అనారోగ్యాలు.. ఆకస్మిక మరణాల కారణంగా ఒక్క 2019లో భారత్ కు జరిగిన నష్టం రూ.2.6లక్షల కోట్లుగా పేర్కొంది. 2019లో భారత్ లో దాదాపు 17 లక్షల మరణాలు వాయు కాలుష్యంతోనే చోటు చేసుకున్న విషయాన్ని గత ఏడాది విడుదలైన లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఇదంతా చూస్తే.. పాలకులు వాయు కాలుష్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వని వైనం.. ఆ కారణంగా చెల్లిస్తున్న మూల్యం వివరాలు చదువుతుంటే.. షాక్ కు గురి కాక తప్పదు. కరోనాకు మించిన ప్రమాదకారిని ప్రభుత్వాలు అంత సింఫుల్ గా వదిలేయటం దేనికి నిదర్శనం?