Begin typing your search above and press return to search.
ఆ ఇడ్లీ పిండి కంపెనీ వెనుక ఇన్ స్పైయిరింగ్ సక్సెస్ స్టోరీ
By: Tupaki Desk | 5 Sep 2021 4:30 AM GMTకష్టం ఊరికే పోదు. నిజాయితీగా పని చేయాలే కానీ విజయం వెతుక్కుంటూ వస్తుంది. ప్రతికూలతల్ని తట్టుకొని.. స్థైర్యంగా నిలబడితే అందుకు తగ్గ ఫలితం ఖాయం. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా. ఇవాల్టి రోజున నగరాల్లోని చాలా వంటిల్లలో దర్శనమిచ్చే 'ఐడీ' ఇడ్లీ.. దోశె పిండి కంపెనీ అధినేత కూడా ఇదే విషయాన్ని చెబుతారు. బంధువుల్లో ఒకరికి వచ్చిన ఐడియాకు పెట్టుబడి పెట్టి.. ఆ తర్వాత ఆ వ్యాపారంలో ఉన్న అవకాశాల్ని గుర్తించిన అతడు అందులో పూర్తిగా దిగిపోవటం.. అడ్డంగా బుక్ కావటం.. కఠిన సవాళ్లను ఎదుర్కొని..తాజాగా వందల కోట్లకు అధిపతిగా మారిన వైనం రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోనిదిగా ఉంటుందని చెప్పాలి. ఇంతకీ అతడెవరు? అతడి జర్నీ ఎలా మొదలైంది? ఒక సాదాసీదా రోజు కూలీ ఇవాల్టి రోజున ఐడీ కంపెనీకి సీఈవోగా ముస్తఫా ఎలా ఎదిగారు? అన్నది చూస్తే..
కేరళకు చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన వాడు ముస్తఫా. రోజు కూలీ చేస్తే కానీ మూడు పూటలా తినలేని పరిస్థితి. ఆరో తరగతి ఫెయిల్ కావటంతో చదువు మానేసి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి. ఇలాంటివేళ.. టీచరు చొరవతో మళ్లీ బడికి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఉద్యోగం సంపాదించి తండ్రి చేసిన అప్పుల్ని తీర్చేసిన అతడు.. ఫారిన్ లో జాబ్ ఛాన్సు రావటంతో వెళ్లిపోయాడు.
జీవితంలో అన్ని సాధించామని భావిస్తున్నా.. ఏదో తెలియని వెలితి అతడ్ని వెంటాడేది. దీంతో.. ఉద్యోగం కాదు వ్యాపారం చేయాలని ఆయన అనుకున్నారు. ఇలాంటి సమయంలో అతడి బంధువు ఒకరు ఇడ్లీ - దోశ పిండి కంపనీని ప్రారంభించాలనే ఆలోచనకు వచ్చారు. దీంతో.. అతనికి రూ.50వేలు పెట్టుబడి సాయం కింద ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసి.. అన్ని చూసుకొమ్మని చెప్పేసి వెళ్లిపోయాడు.మూడు సంవత్సరాల తర్వాత ఇడ్లీ పిండి కంపెనీలో ఫోకస్ పెడితే లాభాల్లోకి వెళ్లటమే కాదు.. భారీ మార్కెట్ ను సొంతం చేసుకోవచ్చన్న విషయాన్ని గుర్తించాడు.
దీంతో.. చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేశాడు. పూర్తి సమయాన్ని వ్యాపారం మీదనే పెట్టాడు. ఇలాంటి వేళలోనే కాలం అతనికి విషమ పరీక్షల్ని పెట్టింది. ఒకదశలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో.. కంపెనీ షేర్లు ఇస్తానని చెప్పి.. అందరి భవిష్యత్తు బాగుంటుందని ఒప్పించాడు. అలా ఎనిమిదేళ్లు అతడు పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం దక్కింది.
కంపెనీకి ఒక పెద్ద ఇన్వెస్టర్ దొరకటం.. ఏకంగా రూ.2వేల కోట్లు ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టటంతో సీన్ మొత్తం మారిపోయింది. కంపెనీ విస్తరించటంతో పాటు.. అమ్మకాలు భారీగా పెరగటం.. వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరిస్తూ దూసుకెళుతున్నాడు. అతడ్ని నమ్మిన కంపెనీ ఉద్యోగులు ఈ రోజు లక్షాధికారులు అయితే.. ఇతగాడు మాత్రం వందల కోట్లకు విస్తరించాడు. నమ్మకం.. నిజాయితీ.. కష్టపడే తత్త్వం కలిస్తే.. కాస్త ఆలస్యంగా అయినా విజయం ఖాయమన్న విషయం మరోసారి ముస్తఫా రూపంలో రుజువైందని చెప్పక తప్పదు.