Begin typing your search above and press return to search.

వ‌లంటీర్లే శ‌ర‌ణ్యం.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల అంత‌రార్థం..

By:  Tupaki Desk   |   2 Jun 2023 5:00 AM GMT
వ‌లంటీర్లే శ‌ర‌ణ్యం.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల అంత‌రార్థం..
X
ఏపీ లో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా? లేక సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తోపాటే జ‌రుగుతాయా? అనే చ‌ర్చ ఒక‌ వైపు జ‌రుగుతూనే ఉంది. అయితే.. ఇటీవ‌ల‌ ఢిల్లీ కి వెళ్లే ముందు సీఎం జ‌గ‌న్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రం లోని 2,39,751 మంది వ‌లంటీర్ల‌ను ఆయ‌న వైసీపీ కి అనుకూలంగా ప‌నిచేయాల‌నే ప‌రోక్ష ప్ర‌క‌ట‌న ఇవ్వడం.. అన్ని పార్టీల్లో నూ క‌ల‌క‌లం రేపుతోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌హానాడులోనూ ప్ర‌స్తావించారు.

2019 ఎన్నిక‌ల అనంత‌రం.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. వెంట‌నే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క‌టించారు. వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఆయ‌న వ‌లంటీర్ల‌ను నియ‌మించి.. ప్ర‌భుత్వ పథ‌కాలు.. సంక్షేమాన్ని కూడా వారితో అమ‌లు చేయించారు. దీంతో ఎమ్మెల్యేల క‌న్నా కూడా వ‌లంటీర్ల‌కు ప్రాధాన్యం పెరిగిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపించింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. కూడా వలంటీర్ల‌కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య అవినాభావ సంబంధం కొన సాగుతోంది.

రాజ‌కీయంగా కూడా వీరిని వినియోగించుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. జ‌గ‌న్ వీటిని ఎప్పుడు ఖండించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక రూపాల్లో వలంటీర్లు వైసీపీ త‌ర‌ఫున ప‌నిచేశార‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. ముఖ్యం గా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వ‌లంటీర్ల కార‌ణంగానే టీడీపీ ఓడిపోయిందనే అంచ‌నాలు ఉన్నాయి. దీని పై కోర్టుల్లో కేసులు కూడా ప‌డ్డాయి. అయితే.. అవి తేల‌డం లేదు. వీటిపై ఎలాంటి తీర్పులు రావ‌డం లేదు.

వ‌లంటీర్ల విష‌యం హైకోర్టు లో విచార‌ణ‌ కు వ‌చ్చిన సంద‌ర్భాల్లో మాత్రం చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏంటి? వారిని ఎలా నియ‌మించుకున్నారు ? వంటి అంశాల‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఇదిలావుంటే.. "రాజ‌కీయంగా మిమ్మ‌ల్ని ఆపేదెవ‌రు" అని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ కి అనుకూలంగా ప్ర‌చారం చేయ‌డం లేదా.. ఓట్లు వేయించ‌డం.. అనే రెండు ప‌నుల‌ ను కూడా వ‌లంటీర్ల‌కు అప్ప‌గించాల‌ని.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారా? అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.

ఇదే జ‌రిగితే.. ఆయా పార్టీల‌ కు ఉన్న‌నాయ‌కుల క‌న్నా.. వ‌లంటీర్‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. దీంతో మ‌రోసారి వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ పై తీవ్ర చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని మ‌హానాడులో ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు దీటుగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు