Begin typing your search above and press return to search.
ప్రియురాలి సోదరుడ్ని కోర్టు ఖర్చులు ఇవ్వాలన్న అమెజాన్ అధినేత
By: Tupaki Desk | 28 Jan 2021 10:30 AM GMTపేకాట పేకాటే.. బావ మరిది.. బావమరిదే అన్నవిషయాన్ని మనోళ్లు ఎప్పుడో చెప్పేశారు. తాజా ఉదంతాన్ని చూస్తే అదే విషయం గుర్తుకు రావటమే కాదు.. మనోళ్ల నోటి నుంచి తరచూ వినిపించే.. ఎక్కడైనా బావ కానీ వంగతోట దగ్గర మాత్రం కాదన్న సామెత గుర్తుకు రాక మానదు. అపర కుబేరుడు.. ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. వ్యక్తిగత అంశాలకు సంబంధించి తన ప్రియురాలి సోదరుడి మీద కేసు వేసిన ఆయన.. తాజాగా చేస్తున్న డిమాండ్ గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో రెండోస్థానంలో నిలిచే అమెజాన్ అధినేత.. తాజాగా కోర్టు ముందు ఆయన వినిపించిన వాదనలు కించిత్ ఆశ్చర్యాన్ని గురి చేయక మానదు. ఎందుకిలా అంటే.. కాస్త వెనక్కి వెళ్లాలి. అనోన్య దాంపత్యం అన్నట్లుగా బెజోస్.. మెకంజీల దాంపత్యం ఉండేది. కానీ.. ఒక న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ తో ప్రేమాయణం గుట్టుచప్పుడు కాకుండా చేసేవాడు. అది కాస్తా బయటకు రావటంతో మెకంజీ విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
ఆ సందర్భంగా సగం ఆస్తిని ఆమెకు ఇచ్చాడు. పెద్ద మనసుతో అనే కన్నా.. విడాకుల సందర్భంగా సెటిల్ మెంట్ లో భాగమనే చెప్పాలి. వీరి వ్యవహారం బయటపడటానికి కారణం.. 2019లో ఆమెతో బెజోస్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావటమే. ఈ ఫోటోల్ని నేషనల్ ఎంక్వైరర్ అనే మీడియా సంస్థ పబ్లిష్ చేసింది. దీంతో.. ఇదో పెద్ద సంచలనంగా మారటమే కాదు.. అప్పటివరకు బుద్ధిమంతుడు అనుకున్న బెజోస్ రహస్య ప్రేమాయణం బయటకు వచ్చింది. ఇక్కడ ట్విస్టు ఏమంటే.. ఈ ప్రైవేటు ఫోటోల్ని ప్రియురాలి సోదరుడు మైఖేల్ లీక్ చేయటం. ఇదే విషయాన్ని బెజోస్ కూడా ఆరోపిస్తుంటారు.
అయితే.. ఈ ఇష్యూలోకి తనను అనవసరంగా లాగారంటూ మైకేల్ మండిపడుతూ.. బెజోస్ మీదా ఆయన సెక్యురిటీ కన్సల్టెంట్ మీదా పరువునష్టం దావా వేశారు. అయితే.. ఇందులో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో కేసును కొట్టేశారు. ఎప్పుడైతే కోర్టు కేసు కొట్టేసిందో వెంటనే బెజోస్ స్పందిస్తూ.. తన పరువు తీశాడంటూ ప్రియురాలి సోదరుడు మైకేల్ మీద లాస్ ఏంజెల్స్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. తమ ప్రైవేటు ఫోటోలను (అందులో ప్రియురాలితో కలిసి ఉన్న బెజోస్ నగ్న ఫోటోలు ఉన్నాయి) 2 లక్షల అమెరికా డాలర్లకు మీడియా సంస్థకు అమ్మేశాడన్నది బెజోస్ ఆరోపణ.
అంతేకాదు.. తనను డబ్బు కోసం బ్లాక్ మొయిల్ చేశాడన్న ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు కేసు విచారణకు అయ్యే ఖర్చును మైకేల్ నుంచి ఇప్పించాలని కోర్టును కోరారు బెజోస్. అపర కుబేరుడే అయినా.. కోర్టు కేసు ఖర్చులను ప్రియురాలి సోదరుడి నుంచి లాగాలన్న పాయింట్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. బెజోస్ డిమాండ్ ఏ మాత్రం సహేతుకంగా లేదని.. మైకేల్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని అడగటం సబబే. కానీ.. కోర్టు ఖర్చులను భరించాలంటూ కేసు వేసినంతనే అడగటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరీ వ్యవహారంపై కోర్టు ఏమని సెలవిస్తుందో చూడాలి.