Begin typing your search above and press return to search.
కేంద్రంతో ఉన్న ఫ్రెండ్‌షిప్ ఓకే.. పవన్ సాధించిందేంటి..?
By: Tupaki Desk | 26 Jan 2023 10:29 AM GMTతాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే.. కేంద్రంతో తనకు అనుకూలత చాలా ఎక్కువగా ఉందన్నారు. అంతేకాదు, తనకు వారికి మధ్య మంచి రిలేషన్ కూడా ఉంద ని చెప్పారు. తాను చెప్పిన మాటలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు తీసేయరని కూడా వ్యాఖ్యానించారు. అందుకే తాను బీజేపీ పెద్దలతో చెలిమి చేస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ బీజేపీ నేతలంటే భయపడు తుంటే.. తాను మాత్రం చేతులు కలుపుతున్నానని చెప్పారు.
ఇక, తాజా విషయానికి వస్తే.. నిజానికి పవన్‌కు కేంద్రంతో ఉన్న చెలిమి కారణంగా ఇప్పటి వరకు సాధిం చిందేంటి ? ఆయన రాజకీయంగా కానీ, లేక రాష్ట్రానికి కానీ తీసుకువచ్చినది ఏదైనా ఉందా ? అనేది ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. కేంద్రంతో చెలిమి ఉంటేనో.. లేక వారి ముందు తాను కాలిపై కాలేసుకుని కూర్చుంటోనో.. పవన్‌కు ఇప్పటి వరకు ఒరిగింది ఏమీ లేదు. అంతేకాదు, ఆయన చేస్తున్న చెలిమి వల్ల పార్టీకి కూడా ఇప్పటి వరకు ప్రయోజనం కనిపించడం లేదు.
ఇక, కేంద్రంతో సఖ్యత ఉన్న పవన్.. రాష్ట్రానికి ఏదైనా ఒక్క ప్రాజెక్టు సాధించి.. దీనిని నేను తీసుకువచ్చా ను అని చెప్పుకొని ఉంటే.. ఇప్పుడు ఎన్నికల వేళ ఆ చెలిమికి గుర్తుగా ఆయన పేరు మార్మోగిపోయేది. కానీ, ఇది ఒక్కటి కూడా ఆయన చేయలేకపోయారు. రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపిన పవన్.. తాను స్వయంగా బీజేపీతో పొత్తులో ఉండి కూడా.. దానికి అనుకూలంగా ఒక్క ప్రతిపాదనను తీసుకురాలేకపోయా రు.
పోనీ.. ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అయినా.. ఆయన కాపాడుకోలేకపోయారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన పవన్.. తెన్నేటి విశ్వనాథం వంటి వారు అప్పట్లో ఎంతో కష్టపడి దీనిని తీసుకువచ్చారని చెప్పారే కానీ.. కేంద్రంతో ఏం మాట్లాడారు? అసలు దీని గురించి ఆయన ఢిల్లీలో ప్రస్తావించారా? అనేది ప్రశ్న. పోనీ.. ఇవి కూడా వదిలేసినా.. పోలవరం నిధుల విషయంలో నేనున్నాను.. కేంద్రం నా మాట వింటుందని.. గతంలోనూ ఇప్పుడు కూడా ఆయన చెప్పరు. మరి ఈ చెలిమి వల్ల ఒరిగింది ఏంటి? అనేది ఆయనే చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.