Begin typing your search above and press return to search.

వామ్మో.. ఇదేం ప్రేయసి రా నాయనా.. మొదటి లవర్‌ బ్రేకప్‌ కు ఒప్పుకోలేదని..!

By:  Tupaki Desk   |   13 April 2023 3:09 PM GMT
వామ్మో.. ఇదేం ప్రేయసి రా నాయనా.. మొదటి లవర్‌ బ్రేకప్‌ కు ఒప్పుకోలేదని..!
X
ప్రస్తుత కాలంలో నిజమైన ప్రేమ చచ్చిపోతోంది. హాయ్, బాయ్‌ టైపు ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమ పేరుతో బెదిరించడాలు, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడాలు, హత్యలకు పాల్పడటాలు ఎక్కువైపోయాయి. చివరకు ఒకరి కంటే ఎక్కువ సంబంధాలు నెరపుతూ అడ్డుగా ఉన్నవారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు.

ఇలాంటి దారుణమే కేరళలోని ఎర్నాకులంలో చోటు చేసుకుంది. మొదటి లవర్‌ తనతో బ్రేకప్‌ కు ఒప్పుకోవడం లేదని ప్రియురాలు ఘాతుకానికి పాల్పడింది. రెండో లవర్‌ తో కలిసి మొదటి లవర్‌ ను అపహరించిన ప్రియురాలు.. అతడి పై దాడి చేయించింది. అంతటితో ఆగకుండా సిగరెట్లతో ఒళ్లంతా కాల్చింది. మొదటి లవర్‌ దుస్తులను కూడా విప్పేసి రోడ్డు పై నగ్నంగా పడేయించింది.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే... కేరళలోని ఎర్నాకులంలోని వర్కాల సమీపంలో అయిరూర్‌ కు చెందిన తన మొదటి లవర్‌ ను చెరున్నియూర్‌ కు చెందిన లక్ష్మీ ప్రియ అనే యువతి అతడి ఇంటి నుంచే కిడ్నాప్‌ చేయించింది. లక్ష్మీ ప్రియ ప్రస్తుతం బీసీఏ చదువుతోంది. లక్ష్మీప్రియ, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె ఇటీవల ఎర్నాకులం కళాశాలలో చేరింది. అక్కడ ఆమెకు ఇంకో యువకుడు పరిచయమయ్యాడు. దీంతో తన మొదటి లవర్‌ ను వదిలించుకోవాలనుకుంది. అతడికి బ్రేకప్‌ చెప్పింది. దీనికి అతడు అంగీకరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన లక్ష్మీప్రియ అతడిని కిడ్నాప్‌ చేయించి దాడి చేసింది.

లక్ష్మీ ప్రియతో పాటు ఆమె ఆరుగురు స్నేహితులు యువకుడి పై దాడికి దిగి అతడిని చిత్రహింసలు పెట్టారని పోలీసులు తెలిపారు. వీరిలో ఆమె రెండో లవర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే లక్ష్మీప్రియ రెండో ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఘటన గురించి బాధితుడి తండ్రి మాట్లాడుతూ లక్ష్మీప్రియ మాయమాటలు చెప్పి తన కొడుకును కారులో తీసుకెళ్లిందని తెలిపారు. తన కుమారుడు కారు ఎక్కిన తర్వాత లక్ష్మీప్రియతోపాటు ఆమె స్నేహితులు తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో అలప్పుజాలో కారు ఆపి.

తన కొడుకు బంగారు గొలుసు, ఖరీదైన మొబైల్‌ ఫోన్, నగదు తీసేసుకున్నారని ఆరోపించారు. అనంతరం ఎర్నాకులంలోని తమ్మనం సమీపంలోని ఓ ఇంటికి తీసుకు వెళ్లి అక్కడే కట్టేసి కొట్టారన్నారు. తర్వాత బట్టలు కూడా తీసేసి మొబైల్‌ ఫోన్లలో వీడియో తీశారన్నారు. అంతటితో ఆగకుండా కరెంట్‌ షాక్‌ కూడా ఇచ్చారు అని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.