Begin typing your search above and press return to search.
ఈ పువ్వును చూడటం అస్సలు మిస్ కావొద్దు
By: Tupaki Desk | 17 Jan 2016 11:25 AM GMTఈ పువ్వును చూస్తే పెద్ద స్పెషల్ అన్నట్లుగా అనిపించదు. భూమి మీద కనిపించే కోట్లాది పువ్వుల్లో ఒకటిలానే అనిపిస్తుంది. కానీ.. ఈ పువ్వు గురించి అసలు విషయం తెలిస్తే మాత్రం ‘వావ్’ అన్న మాట మీ నోటి వెంట ఖాయం. ఎందుకంటే.. ఈ పువ్వు చాలా చాలా స్పెషల్. ఎలానంటే.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు ఆరు నెలలు కష్టపడితే పుట్టిన తొలిపువ్వు. ఇంకాస్త సింఫుల్ గా చెప్పాలంటే.. అంతరిక్షంలో పూసి మొట్టమొదటి పువ్వు ఇది.
అంతరిక్ష కేంద్రంలో జిన్నియా విత్తనాలు నాటటంతో శాఖాహార మొక్కల పెంపకానికి నాసా శ్రీకారం చుట్టింది. మొక్కల్ని పెంచటం సులువైతే.. రానున్న రోజుల్లో కాయగూరలు పండించాలన్నది లక్ష్యం. భూమికి సదూరంగా ఉండే అంతరిక్షంలో మానవ అవాసానికి వీలుగా పరిస్థితుల్ని తయారు చేయాలన్న లక్ష్యంతో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు అందులో భాగంగా ఈ మొక్కను పెంచారు. దీన్ని పెంచటానికి.. ఎదిగేందుకు వీలుగా ఎరుపు.. బ్లూ.. గ్రీన్ ఎల్ ఈడీ బల్బుల కాంతిని ఎరువుగా వినియోగించారు. ఈ పువ్వు స్పెషల్ ఏమిటంటే.. దీన్ని అసాంతం తినేయొచ్చు కూడా. ఇక.. ఈ పువ్వు విశేషాల్ని అంతరిక్ష కేంద్రంలో ఉన్న మహిళా శాస్త్రవేత్త స్కాట్ కెల్లీ ట్వీట్ చేయటంతో.. ఈ విశేషం ప్రపంచ ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఈ పవ్వు సో.. స్పెషల్ అని..?