Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్‌ లో కొత్తరకం కరోనా తొలి కేసు..లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు

By:  Tupaki Desk   |   26 Dec 2020 8:00 AM GMT
ఫ్రాన్స్‌ లో కొత్తరకం కరోనా తొలి కేసు..లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు
X
కొత్త స్ట్రెయిన్​ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్నది. ఇప్పటికే బ్రిటన్​లో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు దేశాలకు బ్రిటన్​కు విమానాల రాకపోకల్ని రద్దు చేశాయి. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్​ రావడంతో యూరప్​ దేశాల్లో గుబులు మొదలైంది. బ్రిటన్​ను ఆనుకొని ఉన్న దేశాలు సరిహద్దుల్ని మూసివేశాయి. మరోవైపు కొత్త స్ట్రెయిన్​ వేగంగా విస్తరిస్తుందని వైద్యులు చెబుతుండటంతో ఆయా దేశాల్లో ఆందోళన మొదలైంది.

అయితే తాజాగా ఈ కొత్త స్ట్రెయిన్​ కేసు ఫ్రాన్స్​లో వెలుగుచూసినట్టు సమాచారం. ఇటీవల బ్రిటన్​ నుంచి ఫ్రాన్స్​ వెళ్లిన ఓ వ్యక్తికి కొత్తరకం కరోనా వచ్చిందట. దీంతో ఆ దేశంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అధికారులు అతడు ఎవరెవరితో కాంటాక్ట్​ అయ్యాడో తెలుసుకుంటున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఫ్రాన్స్ పౌరుడు.. డిసెంబరు 19న ఫ్రాన్స్​ వచ్చాడు. అతడిలో ఏ లక్షణాలు కనిపించలేదు. అయిననప్పటికీ సెల్ఫ్​ క్వారంటైన్​లో ఉన్నారు. అయితే డిసెంబర్​ 21న అతడికి పరీక్షలు చేయగా.. కొత్త స్ట్రెయిన్​ సోకినట్టు గుర్తించారు.

ప్రస్తుతం ఫ్రాన్స్​లో కరోనా వచ్చినవారందరికీ కొత్త స్ట్రెయినా లేక పాత కరోనా అని తెలుసుకుంటున్నారు. ఇటీవల కరోనా సోకినవారికి కొత్త స్ట్రెయిన్​ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఫ్రాన్స్​లోని జాతీయ పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ప్రత్యేక ప్రయోగశాలలో ‘VOC 202012/01’ (కొత్తకరోనా) వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారు. మరోవైపు డెన్మార్క్‌లో తొమ్మిది, నెదర్లాండ్, ఆస్ట్రేలియాలో ఒక్కొక్కటి చొప్పున కొత్తరకం కరోనా కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.