Begin typing your search above and press return to search.

కుమార్తె పెళ్లికి తిరిగి వచ్చేసిన తండ్రి..వైరల్ గా ఆ పెళ్లి ఫోటో

By:  Tupaki Desk   |   13 Feb 2021 3:30 PM GMT
కుమార్తె పెళ్లికి తిరిగి వచ్చేసిన తండ్రి..వైరల్ గా ఆ పెళ్లి ఫోటో
X
నిజమే.. కుమార్తె పెళ్లికి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ఆ తండ్రి తిరిగి వచ్చారు. కాకుంటే.. మైనపు బొమ్మ రూపంలో. దూరం నుంచి చూసినప్పుడు.. చెప్పేంతవరకు అది బొమ్మ అన్న భావన కలగనీయకుండా చేసిన ఈ వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో తమకు దూరమైన వారు.. లేరన్న వేదనకు భిన్నంగా వారి మైనపు బొమ్మలు చేయించే అలవాటు ఈ మధ్యన పెరిగింది. అందుకు తగ్గట్లే.. తాజాగా తమిళనాడులో జరిగిన పెళ్లిలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది.

తండ్రి అంటే లక్ష్మీ ప్రభకు చాలా ఇష్టం. తమిళనాడుకు చెందిన ఈ నవ వధువు తండ్రి చాలా కాలం క్రితమే మరణించారు. తన పెళ్లి సమయంలో ఆయన ఉంటే బాగుండేదన్న భావన కలిగేది. ఆవేదనను తన తోబుట్టువుతో పంచుకోవటమే తప్పించి మరింకేమీ చేయలేని పరిస్థితి. ఇలాంటివేళ.. లక్ష్మీ ప్రభ సోదరి వినూత్నంగా ఆలోచించింది. తండ్రి లేరన్న నిరాశలో ఉన్న చెల్లెలకు సర్ ప్రైజ్ చేసేందుకు.. వీలుగా తండ్రి మైనపు విగ్రహాన్ని తయారు చేయించింది.

అందుకు రూ.6లక్షల మొత్తాన్ని వెచ్చించి.. తన చెల్లెలు ముఖంలో ఆనందం చూడాలని డిసైడ్ అయ్యింది. చెల్లి పెళ్లి కానుకగా.. తండ్రి మైనపు విగ్రహాన్ని ఇచ్చింది. తన పెళ్లి వేళ.. తండ్రి తోడుగా లేరన్న లక్ష్మీ ప్రభ దిగులును తన నిర్ణయంతో పోగొట్టిన ఆమె సోదరి వైనం ఇప్పుడు అందరిని ఆకర్సిస్తోంది. ఊహించని విధంగా అక్క ఇచ్చిన పెళ్లి కానుకకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. చెల్లెలు ఆనందం కోసం ఆ అక్క పడిన ఆరాటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.