Begin typing your search above and press return to search.
ప్రేమించిందని.. కూతురు తలను నరికేసిన తండ్రి.. పాణ్యంలో దారుణం
By: Tupaki Desk | 25 Feb 2023 10:01 AM GMTప్రేమించి పరువు తీసిందన్న కోపంతో కూతురిని దారుణంగా హతమార్చిన ఉదంతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి విన్న వారంతా షాక్ అవుతున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని అలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి కి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు ప్రసన్న.
రెండేళ్ల క్రితం ఆమెకు ఒక ఐటీ ఉద్యోగితో పెళ్లి చేశారు. వారు హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే.. పెళ్లికి ముందే ప్రసన్న మరొక వ్యక్తిని ప్రేమిస్తూ ఉండేది. అతనితో సాన్నిహిత్యం కారణంగా హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసింది. తర్వాత భర్త వద్దకు వెళ్లలేదు. ఈ ఉదంతంలో తన పరువు పోయిందని భావించిన దేవేందర్ రెడ్డి.. కుమార్తెను దారుణంగా హతమార్చాడు.
ఈ నెల పదో తేదీని ఇంట్లో ఉన్న ప్రసన్న గొంతు నులిమి చంపేసిన అతడు.. ఆ తర్వాత మరికొందరితో కలిసి కూతురు డెడ్ బాడీని కారులో నంద్యాల - గిద్దలూరు మధ్యలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె తలను.. మొండాన్ని వేరు చేశాడు. ఆ తర్వాత రెండింటిని వేర్వేరు చోట్ల పడేసి తిరిగి వచ్చేశాడు. ఏమీ తెలియని వ్యక్తిలా నటిస్తూ ఉండిపోయాడు.
అయితే.. తన మనవరాలు ఫోన్ చేయకపోవటంతో అనుమానించిన ఆమె తాత శివారెడ్డి ప్రసన్న ఎక్కడకు వెళ్లిందంటూ ఆరా తీశాడు. అయినా సమాధానం రాకపోవటంతో. దేవేందర్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించాడు. దీంతో.. కూతురు ప్రేమించి పరువు తీసిందని.. అందుకే చంపేశానని చెప్పటంతో షాక్ తిన్న తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. దేవేందర్ రెడ్డిని తాజాగా అరెస్టు చేసి..
మొండాన్ని.. తల కోసం వెతికారు. రెండు రోజుల వెతుకులాట అనంతరం తల.. మొండం లభించాయి. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఎంత ప్రేమిస్తే మాత్రం.. కన్నకూతుర్ని ఇంత అమానుషంగా చంపేయటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత అయ్యో.. ప్రసన్నా అనుకోకుండా ఉండలేం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.