Begin typing your search above and press return to search.
512 కేజీల ఉల్లి అమ్మిన రైతు కళ్లల్లో రక్తమే కారింది
By: Tupaki Desk | 25 Feb 2023 9:34 AM GMTమన్మోహన్ సింగ్.. నరేంద్ర మోడీ.. అధికార పీఠంలో ఎవరు కూర్చున్నా సరే.. సామాన్యుడి జీవితాలు మాత్రం ఒకేలా ఉంటున్నాయే తప్పించి మార్పు రావట్లేదు. అభిమానంతో మాట్లాడే మాటల్ని పక్కన పెట్టేసి.. వాస్తవంగా జరుగుతున్న అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే ఈ తరహా మాటలు రావటం ఖాయం. అరుగాలం కష్టపడి పండించే రైతు చేతికి నోట్ల కట్టలు రాకున్నా.. తమకు శ్రమకు తగ్గ కనీస ఫలితం రావాలని కోరుకోవటం కనీస న్యాయం. కానీ.. అలాంటిదేమీ కనిపించని పరిస్థితి. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పే మాటలకు.. చేతలకు మధ్యన ఉన్న దూరం ఎంతన్నది తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఉదంతమే నిదర్శంగా చెప్పొచ్చు.
బహిరంగ మార్కెట్ లో కేజీ రూ.20, అదే సూపర్ మార్కెట్ లో అయితే కేజీ పాతిక రూపాయిలకు తగ్గని ఉల్లిపాయ ధర పలుకుతున్న విషయం తెలిసిందే. మరి.. ఇదే ఉల్లిని పండించే రైతు పరిస్థితేంటి? అన్న విషయానికి వస్తే.. వాస్తవం తెలిస్తే నోట మాట రాదు. మహారాష్ట్రకు చెందిన ఒక రైతు పండించిన 512 కేజీల ఉల్లిపాయల్ని తీసుకొని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మగా.. అతనికి అన్ని ఖర్చులు పోను కేవలం రూ.2 మాత్రమే మిగిలిన దుస్థితి. అది కూడా ఆ మిగిలిన రూ.2 మొత్తాన్ని 15 రోజుల తర్వాత చెల్లుబాటయ్యేలా చెక్కు రూపంలో. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. మహారాష్ట్రలోని బర్గాన్ గ్రామానికి చెందిన రైతు 58 ఏళ్లు రాజేంద్ర తుకారాం చవాన్.
తన పొలంలో పండించిన ఉల్లి పంటను తీసుకొని తనకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న షోలాపూర్ వ్యవసాయ మార్కెట్ కు వెళ్లాడు. మొత్తం 512 కేజీల ఉల్లిని తీసుకెళ్లగా.. వేలంలో కేజీ ఉల్లికి రూపాయి చొప్పున మాత్రమే ధర పలికింది. దీంతో.. మొత్తం 512 కేజీల ఉల్లికి రూ.512 వచ్చాయి. ఇందులో వ్యాపారి రవాణా..లేబర్.. మార్కెట్ సెస్.. తూకం ఖర్చులు మొదలైనవన్నీ కలపగా రూ.509.51 ఖర్చు వచ్చింది. ఆయనకు ఇవ్వాల్సిన రూ.512లో ఈ మొత్తాన్ని తీసేయగా.. రూ.2.49 రసీదు ఇచ్చారు. బ్యాంకు లావాదేవీల్లో భాగంగా 49 పైసల మొత్తాన్ని అడ్జస్ట్ మెంట్ లో భాగంగా తీసేసి.. రూ.2 చెక్కును చేతిలో పెట్టారు.
ఈ భారీ మొత్తం చెక్కును పదిహేను రోజుల తర్వాత చెల్లుబాటయ్యేలా పోస్టు డేటెడ్ చెక్కు ఇచ్చారు. దీంతో.. తన కష్టానికి దక్కిన ఫలితం ఇదేనా? అంటూ సదరు చెక్కును చూపిస్తూ ప్రశ్నిస్తున్న చవాన్ కు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆయన ప్రదర్శించిన చెక్కు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రైతుకు వచ్చిన ప్రతిఫలంపై తీవ్ర మండిపాటు వ్యక్తమవుతోంది.
దీంతో.. మార్కెట్ కమిటీ రంగంలోకి దిగింది. చవాన్ తీసుకొచ్చిన 513 కేజీల ఉల్లిపాయలు నాసిరకమని.. అందుకే అంత తక్కువ ధర పలికినట్లుగా పేర్కొన్నారు. అక్కడితో ఆగని వారు.. తాము గతంలో కూడా రూ.2 కంటే తక్కువ మొత్తానికి చెక్కు ఇచ్చినట్లుగా పేర్కొన్న వారి మాటల్ని చూస్తే.. రైతుల కష్టం ఒకవైపు.. వ్యాపార దోపిడీ మరోవైపు కొట్టొచ్చినట్లుగా కనిపించటం ఖాయం. సాధారణంగా ఉల్లిని కోస్తున్నప్పుడు కంట వెంట నీళ్లు కారతాయి. తాజాగా వ్యవహారంలో మాత్రం ఉల్లిని పండించిన అమ్మిన రైతు కళ్లల్లో రక్తమే కారిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.