Begin typing your search above and press return to search.

మోడీ వినియోగించే మాస్కు వివరాల వ్యక్తిగతమట

By:  Tupaki Desk   |   5 Feb 2021 6:30 AM GMT
మోడీ వినియోగించే మాస్కు వివరాల వ్యక్తిగతమట
X
కరోనా పుణ్యమా అని ముఖానికి మాస్కు అన్నది ఒక అలవాటుగా మారింది. ఒక రకంగా చూస్తే.. ఆరోగ్యానికి మేలు చేసే ఈ అలవాటు మంచిదే అయినా.. మాస్కుల వినియోగంపై సరైన అవగాహన ఉన్న వారు కొద్దిమందేనని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని మోడీ వినియోగించే మాస్కు ఏమిటి? దాని ఖరీదు ఎంత? ఇప్పటివరకు మాస్కుల కోసం మోడీ మాష్టారు ఎంత ఖర్చు చేశారు? లాంటి బోలెడన్ని సందేహాలు పలువురికి వస్తాయి.

కానీ.. వారంతా తమకు వచ్చిన డౌట్లను అలానే ఉంచేసుకుంటారు. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా ఆ వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశారు హైదరాబాద్ కు చెందిన రాబిన్. గత ఏడాది డిసెంబర్ లో సమాచార హక్కు చట్టం కింద ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రధాని మోడీ వినియోగించే మాస్కుకు సంబంధించిన పలు ప్రశ్నల్ని అడిగి.. వాటికి సమాధానాలు కోరారు.

మోడీ ఎలాంటి మాస్కు ధరిస్తున్నారు? వాటి విలువ ఎంత ఉంటుంది? ఆయనకు వ్యాక్సిన్ వేశారు? లాంటి ప్రశ్నలకు స్పందించింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) కింద రాబిన్ అడిగిన వివరాలు వ్యక్తిగతమైనవని.. మాస్క్ వివరాలు.. దానికైన ఖర్చు.. వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ప్రధానికి అయ్యే మాస్కు ఖర్చుల్ని ప్రభుత్వం భరించదని బదులిచ్చారు.