Begin typing your search above and press return to search.

రాజకీయాల నుంచి తప్పుకుంటామంటున్న దాడి ఫ్యామిలీ...?

By:  Tupaki Desk   |   7 July 2023 11:47 PM GMT
రాజకీయాల నుంచి తప్పుకుంటామంటున్న దాడి ఫ్యామిలీ...?
X
అనకాపల్లి రాజకీయాల ను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తూ వస్తున్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఇపుడు అధికార పార్టీలో ఉన్నా ఫ్యాన్ నీడన ఉన్నా కూడా ఉక్క బోతతో సతమతం అవుతున్నారా అన్నదే చర్చగా ఉంది. దాడి వీరభద్రరావు 2004 వరకూ అపజయం ఎరగని నేతగా ఉన్నారు.

ఆయన 1985లో మొదటిసారి ఎన్టీయార్ పిలుపు అందుకు ని రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అది లగాయితూ 1989, 1994, 1999లలో వరస గా గెలిచారు. అలా నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖల ను మంత్రిగా ఉన్నారు. అనకాపల్లి రాజకీయాల ను శాసించారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.

అలాంటి దాడి వీరభద్రరావు 2012 నుంచి రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగులతో ఇపుడు ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. రెండవసారి ఎమ్మెల్సీ పదవి పూర్తి అయిన తరువాత రెన్యూవల్ చేయలేదని అలిగిన దాడి వైసీపీ లో చేరారు. 2014లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నా ఓడిపోయారు.

ఆ తరువాత ఆయన వైసీపీ లో ఉండలేక బయట కు వచ్చారు. మళ్లీ టీడీపీకి దగ్గర అయ్యారు. కానీ 2019 ఎన్నీకల ముందు వైసీపీ లో వేవ్ చూసి ఆ వైపు వెళ్లారు. ఇలా అటూ ఇటూ తిరగడంతో ఆయన కు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. అయితే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పింది. కానీ నాలుగేళ్ళ పాలన లో ఆ పదవులూ లేవు. దాంతో దాడి ఫ్యామిలీ అసంతృప్తిగా ఉంది.

మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో టికెట్ కూడా తమకు దక్కదన్న అనుమానాలు ఇపుడు ఆ ఫ్యామిలీకి వున్నాయని అంటున్నారు. 2024లో అనకాపల్లి నుంచి అయితే గుడివాడ అమరనాధ్ లేకపోతే అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి లలో ఒకరికి టికెట్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు భీశెట్టి సత్యవతి హై కమాండ్ కి తన ప్రతిపాదనను కూడా పెట్టారని అంటున్నారు.

దాంతో దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ ఈ సీటు మీద పెట్టుకున్న ఆశలు మారుతున్న రాజకీయ సమీకరణల తో గల్లంతు అవుతున్నాయని అంటున్నారు. ఈ పరిణామాలతోనే గత కొంతకాలంగా దాడి వీరభద్రరావు సైలెంట్ అయ్యారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాల ని ఆయన పట్టుపడుతున్నారు. సీటు ఇవ్వకపోతే రాజకీయాలకే దాడి కుటుంబం గుడ్ బై కొడుతుంది అని ప్రచారం సాగుతోంది. బలమైన గవర సామాజికవర్గానికి చెందిన దాడి ఫ్యామిలీ రాజకీయంగా తప్పుకుంటాన ని ప్రచారం జరగడం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

మరి దీని మీద వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అన్నది తెలియడంలేదు. దాడి వీరభద్రరావు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని ఇక ఆయన కుమారుడు రాజకీయంగా పుంజుకోవడం లేదన్న అంచనాలు అయితే వైసీపీ లో ఉన్నాయని అంటున్నారు. మరి దాడి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచి నిజంగా తప్పుకుంటారా లేక టీడీపీ లో చేరి వైసీపీ ని దెబ్బ తీస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఒక మంత్రి ఉన్న చోట వైసీపీ లో రాజకీయాలు అయితే అసలు బాగులేవు అని అంటున్నారు. అనకాపల్లిని చక్కదిద్దుకోవాల ని అంటున్నారు.