Begin typing your search above and press return to search.
ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా రూ.80 కోట్లు !
By: Tupaki Desk | 24 Feb 2021 10:30 AM GMTసాధారణంగా ఓ ఇంటి కరెంట్ బిల్లు వందల్లోనే, లేక కొంచెం ఎక్కువగా వినియోగిస్తే వేలలో రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ వ్యక్తి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎందుకంటే 80 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటికి ఏకంగా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది.ఈ కరెంట్ బిల్లును చూడగానే ఆ 80 ఏళ్ల పెద్దాయనకు గుండెలో నొప్పి మొదలుకావడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంబైలోని వాసాయి ప్రాంతంలో నివసించే గణపత్ నాయక్ కు ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ జనవరి నెలకు బిల్లు పంపింది. దాన్ని చూడగానే ఆ పెద్దాయనకు ఒక్కసారిగా బీపీహైరేంజ్ కి చేరింది. ఎందుకంటే ఆయనకు వచ్చిన బిల్లు రూ.80 కోట్లు (మొత్తం రూ.80,13,89,600). ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా వచ్చింది, అసలు ఆ బిల్లును ఎలా కట్టాలి అంటూ ఆ వృద్ధుడు కూలబడిపోయాడు. వెంటనే కుటుంబీకులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గణపత్ నాయక్ కుటుంబం వాసాయ్ ప్రాంతంలో గత 20 ఏండ్లుగా రైస్ మిల్లును నడుపుతున్నది. అయితే, లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా మూతపడి ఉన్నది. డిసెంబర్ నెలలోనే రైస్ మిల్లును తెరిచి శుభ్రం చేసి ప్రారంభించారు. ఇంతలోనే ఇలా రూ.80 కోట్ల బిల్లు రావడంతో హతాశుడయ్యాడు. గతంలో తాము అత్యధికంగా నెల బిల్లు కింద రూ.54 వేలు చెల్లించామని, ఇప్పుడిలా రూ.80 కోట్లు కట్టమని బిల్లు పంపించారని నాయక్ కుటుంబం వాపోతున్నది. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎంఎస్‌ఈడీసీఎల్) స్పందించింది. బిల్లు తయారీలో ఏదో తప్పు జరిగి ఉంటుందని ఎంఎస్ ఈడీసీఎల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సురేంద్ర ముంగేర్ చెప్పారు. మీటర్ రీడింగ్ ఏజెన్సీల తప్పిదం కారణంగా అలా వచ్చి ఉంటుందని, త్వరలోనే దీనిని మార్చి కొత్తది జారీ చేస్తామని ఆయన తెలిపారు.