Begin typing your search above and press return to search.
ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి కరోనా ముప్పు ఎక్కువే.. కానీ వాళ్లు సేఫ్!
By: Tupaki Desk | 26 April 2021 10:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. మనదేశంలోనూ గత నెల నుంచి విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వేళ జనాలకు పౌష్టికాహారంపై స్పృహ కలిగింది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే బలవర్ధక ఆహారాన్ని తయారుచేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
మనం తీసుకునే ఆహారం, రోగ నిరోధక శక్తిని బట్టి వైరస్ ప్రభావం చూపుతోంది. మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే ప్రమాదం తక్కువేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శాకాహారుల్లో సెరో-పాజిటివిటీ స్వల్పమేనని పరిశోధనల్లో తేల్చారు. యాండీ బాడీల తయారీపై నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయాలు బయటపడినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 140 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులపై నిర్వహించిన సర్వేలే ఈ అంశాలు వెల్లడయ్యాయని అన్నారు.
రక్త గ్రూపులను బట్టి కరోనా ప్రభావం ఉంటుందని చెప్పారు. ఓ గ్రూపు వారికి కరోనా ప్రభావం తక్కువేనని చెప్పారు. బీ, ఏబీ వారికి వైరస్ తో ముప్పు ఉంటుందని వివరించారు. రోగ నిరోధక శక్తితో పాటు రక్త గ్రూపులు కరోనాపై ప్రభావం చూపుతాయని తేల్చారు. గ్రూపులు ఎలా ఉన్నా పౌష్టికాహారం తీసుకుంటే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
శాకాహారులే కాకుండా సిగరెట్ తాగేవారు కరోనా నుంచి సేఫ్ అని నిపుణులు అంటున్నారు. ధూమపానం చేసే వారి గొంతులో ఓ సన్నని పొర ఉంటుందని... అది వైరస్ ని అడ్డుకుంటుందని నిపుణులు చెప్పారు. వివిధ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బాడీలు తయారవుతాయని అన్నారు. ఫలితంగా వైరస్ ను ఎదుర్కొగలమని సూచించారు.