Begin typing your search above and press return to search.

పురుషులకే కరోనా ముప్పు ఎక్కువ.. మహిళలు అందుకే సేఫ్..!

By:  Tupaki Desk   |   24 April 2021 1:30 PM GMT
పురుషులకే కరోనా ముప్పు ఎక్కువ.. మహిళలు అందుకే సేఫ్..!
X
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. రెండో దశలో భాగంగా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో విపరీతంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అయితే కరోనా బాధితుల్లో ఎక్కువగా పురుషులే ఉండడం గమనార్హం. వైరస్ ముప్పు ఎక్కువగా పురుషులకే ఉంటుందని జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించారు. మృతుల్లోనూ పురుషులే అధికంగా ఉన్నారని తేల్చారు.

పురుషులపై పంజా
తెల్లజాతీయుల స్త్రీల కంటే నల్లజాతి స్రీలకు కొవిడ్ తో 4 రెట్ల అధిక ముప్పు ఉందని చెప్పారు. ఆసియన్, అమెరికన్ పురుషులకన్నా నల్లజాతి మహిళలు కరోనా బారిన పడి మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. మగవారిలోనూ తెల్లజాతి పురుషుల కన్నా నల్లజాతి పురుషులే ఎక్కవ మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ఈ మరణాల రేటు ఆరు రెట్ల కంటే అధికంగా ఉందని తెలిపారు. కొవిడ్ మహమ్మారితో అధిక ముప్పు పురుషులకే ఉందని తేల్చారు. తెల్లజాతీయుల పోషకాహారం దృష్ట్యా వారికి మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు.

స్త్రీలకు తక్కువ ఎందుకు?
స్త్రీలల్లో మల్టీవిటమిన్స్, ఒమేగా-3, ప్రోబయోటిక్స్, విటిమిన్ డి సప్లిమెంట్స్ వంటివి కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయా? అనే అంశంపై అధ్యయనాలు జరిపారు. విటమిన్ సీ, జింక్, గార్లిక్ పదార్థాలు తీసుకున్నా వైరస్ బారిన పడే అవకాశం ఉందా అని పరిశోధనలు చేశారు. యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో ఆసక్తిర అంశాలను వెల్లడించారు. కరోనా సోకిన మధ్య వయస్కుల లక్షణాలను పరిశీలించారు.

ఆహారమే కీలకమా?
గతేడాది కొంతమందిపై నిర్వహించిన పరిశోధనల్లో అందరికీ ఒకే రకమైన ఆహార పదార్థాలను ఇచ్చారు. ఆ తర్వాత కొందరి ఆహారంలో మార్పు చేశారు. ఇలా ప్రతీది నమోదు చేస్తూ కొంతకాలం పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో ప్రోబయోటిక్స్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మల్టీవిటమిన్లు, విటమిన్ డి తీసుకోవడం వల్ల కరోనా ప్రభావం తక్కువగా ఉందని తేల్చారు. విటమిన్ సి, జింక్, గార్లిక్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిలో ఎలాంటి మార్పులు గుర్తించలేదని వెల్లడించారు. అందుకే మహిళల్లో కరోనా ముప్పు తక్కువే ఉందని ఆ అధ్యయనాల్లో తెలిపారు.