Begin typing your search above and press return to search.

బాలుడి పై దాడి చేసిన చిరుత.. బోను లో చిక్కింది!

By:  Tupaki Desk   |   24 Jun 2023 12:06 PM GMT
బాలుడి పై దాడి చేసిన చిరుత.. బోను లో చిక్కింది!
X
తిరుమల అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో బాలుడు తీవ్రంగా గాయపడగా... హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందున్న కౌశిక్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. అయితే అలా దాడి చేసిన చిరుత తాజాగా బోను లో చిక్కింది.

అవును... మొన్న రాత్రి తిరుమల మెట్ల మార్గంలో బాలుడి పై దాడి చేసిన చిరుత బోనుకు చిక్కింది. బాలుడి పై చిరుత దాడి చేసిందన్న విషయం తెలియగానే దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగం లోకి దిగారు. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా... చిరుత సంచారాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి 10:45 గంటల ప్రాంతంలో చిరుత బోను లో చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుత ను బంధించడం పై భక్తులు టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఈవో ధర్మారెడ్డి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా.. భక్తుల ను ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది చొప్పున భక్తుల ను బృందాలుగా పంపే ఏర్పాటు చేశారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్‌ ఉంటారు. ఇదే సమయంలో.. సాయంత్రం 6 గంటల తరువాత ఘాట్‌ రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధికారులు యోచిస్తున్నారని అన్నారు.

కాగా... గురువారం 7వ మైలు దగ్గర మూడు సంవత్సరాల బాలుడు కౌశిక్ పై చిరుత దాడిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అందరి అరుపుల కు భయపడిన చిరుత బాలుడిని 150 మీటర్ల దూరంలో ఆ బాలుడిని వదిలేసి వెళ్లింది. ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్న కౌశిక్ పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తుంది.