Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ‘కోవాగ్జిన్’కు ఓకే.. తర్వాతేం జరగనుంది?
By: Tupaki Desk | 3 Jan 2021 3:44 AM GMTహైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి వీలుగా కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ నియమించిన నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. టీకాకు సంబంధించి భారత్ బయోటెక్ సమర్పించిన ట్రయల్స్ కు సంబంధించిన డేటాను పరిశీలించిన అనంతరం.. ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ టీకా భారత్ లో వినియోగానికి ఆమోదముద్ర వేసిన వెంటనే.. భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ కుఓకే చెబుతూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
నిపుణుల కమిటీ ఓకే చెప్పిన తర్వాత సాధారణ వినియోగానికి సంబంధించి ఏమేం జరగాల్సి ఉంది? అదెంత కాలం పడుతుంది? అన్నది ప్రశ్నగా మారింది. నిపుణుల కమిటీ ఓకే అన్న నేపథ్యంలో ఇప్పుడు డీసీజీఐ అంతిమ ఆమోదం వేయాల్సి ఉంది. ఒకసారి టీకా వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. కంపెనీ తన టీకాను మార్కెట్లోకి భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంది.
అందుకు అనుమతులు లభించిన వెంటనే.. వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలవుతుంది. ఆ మాటకు వస్తే.. అనుమతి లభించటానికి ముందే.. భారీ ఎత్తున టీకాల్ని తయారు చేసి ఉంటారని చెబుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రస్తుతం కోటి టీకాల్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. కోవాగ్జిన్ తో పాటు.. సీరమ్ సంస్థతో పాటు కాడిలా సంస్థ రూపొందించిన టీకాలకు నిపుణులు కమిటీ ఓకే చెప్పింది.
ఈ వ్యాక్సిన్ ను రోగికి ఇచ్చే ముందు.. ప్రతి ఒక్కరి నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటారు. టీకాల వల్ల తలెత్తే అవకాశం ఉన్న సైడ్ ఎఫెక్టులను రోగికి వివరిస్తారు. వారి కుటుంబ సభ్యులకు తెలుపుతారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తున్నారని చెబుతున్నారు. మూడో ట్రయల్స్ పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి ఆమోద ముద్ర వేయనున్నారు.