Begin typing your search above and press return to search.
దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్మన్ పై కేసు
By: Tupaki Desk | 4 April 2021 5:30 AM GMTదొంగ ఓటు వేసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్పప్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓటువేసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తీరు దుమారం రేపింది. తనకు ఓటు హక్కు లేకున్నా దొంగ ఓటు వేశారని కాంగ్రెస్ నేతలు సాక్ష్యాధారాలతో రాష్ట్ర ఎన్నికల అధికారి సుశాంత్ గోయల్ కు ఫిర్యాదు చేశవారు.
దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ చైర్ పర్సన్ పై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సహాయ ఎన్నికల అధికారి మోతీలాల్ ఫిర్యాదు చేయడంతో తాటికొండ స్వప్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు తాండూరు మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి చైర్ పర్సన్ స్వప్న రావడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు బల్దియా కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దొంగ ఓటు వేసిన తాటికొండ స్వప్నను బడ్జెట్ సమావేశానికి రాకుండా అడ్డుకోవాలని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.ఇక బడ్జెట్ సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో వెళ్తూ ఉండగా ప్రతిపక్ష కౌన్సిలర్లలు నిరసన వ్యక్తం చేశారు.